యాక్సిస్‌ బ్యాంక్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కేపీఎంజీ చేతికి | KPMG to do Axis Bank's forensic audit to boost safety: Bank CEO | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంక్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కేపీఎంజీ చేతికి

Dec 19 2016 1:54 AM | Updated on Sep 4 2017 11:03 PM

యాక్సిస్‌ బ్యాంక్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కేపీఎంజీ చేతికి

యాక్సిస్‌ బ్యాంక్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కేపీఎంజీ చేతికి

ఖాతాల మదింపు, బ్యాంకింగ్‌ కార్యకలాపాల భద్రతను పెంచేందుకుగాను గ్లోబల్‌ అకౌంటింగ్‌ దిగ్గజం కేపీఎంజీతో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించనున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓ

న్యూఢిల్లీ: ఖాతాల మదింపు, బ్యాంకింగ్‌ కార్యకలాపాల భద్రతను పెంచేందుకుగాను గ్లోబల్‌ అకౌంటింగ్‌ దిగ్గజం కేపీఎంజీతో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించనున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓ శిఖా శర్మ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) తర్వాత పలు యాక్సిక్‌ బ్యాంక్‌ శాఖలో ఇటీవల సిబ్బంది అవినీతికి పాల్పడిన కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో బ్యాంక్‌ ఈ చర్యలు చేపట్టింది. నోయిడాలోని ఒక యాక్సిస్‌ బ్రాంచ్‌లో 20 డొల్ల(షెల్‌) కంపెనీలను సృష్టించి అందులోకి రూ.60 కోట్లను మళ్లించి నట్లు ఐటీ శాఖ గతవారం బయటపెట్టిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ చీఫ్‌ శిఖా శర్మ ఖాతాదారులకు లేఖ రాశారు. బ్యాంక్‌ ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని.. అయితే, ఇటీవల వెలుగు చూసిన కొన్ని కేసుల నేపథ్యంలో అనుమానాస్పద ఖాతాలను గుర్తించే చర్యలు చేపట్టామని చెప్పారు.

 నియంత్రణ సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా వీటిని గుర్తించే పనిని మొదలుపెట్టినట్లు తెలిపారు. కార్యకలాపాల మదింపు, మరింత భద్రత కోసం ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను కూడా చేపట్టనున్నామని, ఇందుకోసం కేపీఎంజీని నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ‘కొం దరు ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలతో చాలా కలత చెందా. దీనికి చింతిస్తున్నా.లావాదేవీలకు సంబంధించి బ్యాం కు అనుసరిస్తున్న విధానాలను కొంతమంది ఉద్యోగులు ఉల్లంఘించారు. వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. బ్యాంకు నియమావళిని ఉల్లంఘించినవారిని ఉపేక్షించం. ఈ ఉదంతంతో 55,000 మంది బ్యాంకు ఉద్యోగుల శ్రమ అంతా తుడిచిపెట్టుకుపోయింది. కా ర్యకలాపాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు బ్యాంకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటుంది. దర్యాప్తు ఏజెన్సీలకు పూర్తిగా సహకరిస్తున్నాం’ అని ఖాతాదారులకు రాసిన లేఖలో శిఖాశర్మ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement