breaking news
CEO Shikha Sharma
-
ఆ రూమర్లను కొట్టిపారేసిన యాక్సిస్ బ్యాంకు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో కొంతమంది అధికారుల అవకతవకలు యాక్సిస్ బ్యాంకు తీవ్ర ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ దాడులతో ఆ బ్యాంకు విసుగెత్తిపోయింది. ఆ సమస్య కొంత సద్దుమణిగిందో లేదో యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే ఈ వార్తలన్ని అసత్యమని యాక్సిస్ బ్యాంకు కొట్టిపారేసింది. తమ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ రాజీనామా చేయడం లేదని యాక్సిస్ బ్యాంకు బుధవారం తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తుందంతా అబద్ధమని, ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ప్రైవేట్ దిగ్గజం బీఎస్ఈకి స్పష్టంచేసింది. పెద్ద నోట్ల రద్దు కాలంలో కొన్ని శాఖల్లో నెలకొన్న అక్రమాలతో ఆదాయపు పన్ను శాఖ ఆ బ్యాంకుపై పలు దాడులు నిర్వహించింది. అంతేకాక మూడో క్వార్టర్ ఫలితాలు బ్యాంకును నిరాశపరిచాయి. మొండిబకాయిలు గుట్టలుగుట్టలుగా పెరిగిపోవడంతో బ్యాంకు నికర లాభాలు 73 శాతం పడిపోయి రూ.580 కోట్లగా నమోదయ్యాయి. -
యాక్సిస్ బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ కేపీఎంజీ చేతికి
న్యూఢిల్లీ: ఖాతాల మదింపు, బ్యాంకింగ్ కార్యకలాపాల భద్రతను పెంచేందుకుగాను గ్లోబల్ అకౌంటింగ్ దిగ్గజం కేపీఎంజీతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత పలు యాక్సిక్ బ్యాంక్ శాఖలో ఇటీవల సిబ్బంది అవినీతికి పాల్పడిన కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో బ్యాంక్ ఈ చర్యలు చేపట్టింది. నోయిడాలోని ఒక యాక్సిస్ బ్రాంచ్‌లో 20 డొల్ల(షెల్) కంపెనీలను సృష్టించి అందులోకి రూ.60 కోట్లను మళ్లించి నట్లు ఐటీ శాఖ గతవారం బయటపెట్టిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ ఖాతాదారులకు లేఖ రాశారు. బ్యాంక్ ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని.. అయితే, ఇటీవల వెలుగు చూసిన కొన్ని కేసుల నేపథ్యంలో అనుమానాస్పద ఖాతాలను గుర్తించే చర్యలు చేపట్టామని చెప్పారు. నియంత్రణ సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా వీటిని గుర్తించే పనిని మొదలుపెట్టినట్లు తెలిపారు. కార్యకలాపాల మదింపు, మరింత భద్రత కోసం ఫోరెన్సిక్ ఆడిట్‌ను కూడా చేపట్టనున్నామని, ఇందుకోసం కేపీఎంజీని నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ‘కొం దరు ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలతో చాలా కలత చెందా. దీనికి చింతిస్తున్నా.లావాదేవీలకు సంబంధించి బ్యాం కు అనుసరిస్తున్న విధానాలను కొంతమంది ఉద్యోగులు ఉల్లంఘించారు. వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. బ్యాంకు నియమావళిని ఉల్లంఘించినవారిని ఉపేక్షించం. ఈ ఉదంతంతో 55,000 మంది బ్యాంకు ఉద్యోగుల శ్రమ అంతా తుడిచిపెట్టుకుపోయింది. కా ర్యకలాపాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు బ్యాంకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటుంది. దర్యాప్తు ఏజెన్సీలకు పూర్తిగా సహకరిస్తున్నాం’ అని ఖాతాదారులకు రాసిన లేఖలో శిఖాశర్మ పేర్కొన్నారు.