రూ.10,000 కోట్ల సమీకరించనున్న జేఎస్పీఎల్ | JSPL to raise up to Rs 10000 crore via securities | Sakshi
Sakshi News home page

రూ.10,000 కోట్ల సమీకరించనున్న జేఎస్పీఎల్

Jun 22 2016 12:50 AM | Updated on Sep 4 2017 3:02 AM

రూ.10,000 కోట్ల సమీకరించనున్న జేఎస్పీఎల్

రూ.10,000 కోట్ల సమీకరించనున్న జేఎస్పీఎల్

నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్) కంపెనీ, ఎన్‌సీడీలు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.10,000కోట్ల నిధులు సమీకరించనున్నది

న్యూఢిల్లీ: నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్) కంపెనీ, ఎన్‌సీడీలు, ఇతర  సెక్యూరిటీల ద్వారా రూ.10,000కోట్ల నిధులు సమీకరించనున్నది. ఆగస్టులో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో ఈ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం కోరతామని జేఎస్‌పీఎల్ పేర్కొంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5,000 కోట్లు నిధుల సమీకరించే ప్రతిపాదనకు  సోమవారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్ ఆమోదం తెలిపిందని జేఎస్‌పీఎల్ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement