ఉపాధి కల్పనే వృద్ధికి కీలకం: డెల్ | Job creation growth is crucial :Dell | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనే వృద్ధికి కీలకం: డెల్

Sep 9 2015 12:04 AM | Updated on Sep 3 2017 9:00 AM

ఉపాధి కల్పనే వృద్ధికి కీలకం: డెల్

ఉపాధి కల్పనే వృద్ధికి కీలకం: డెల్

అధిక ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాలంటే భారత్ భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని డెల్ సంస్థ చైర్మన్ మైఖేల్ ఎస్ డెల్ తెలిపారు...

బెంగళూరు: అధిక ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాలంటే భారత్ భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని డెల్ సంస్థ చైర్మన్ మైఖేల్ ఎస్ డెల్ తెలిపారు. అలాగే విద్యావంతులు, సమర్ధులైన వారి కోసం అన్వేషించే దేశ, విదేశ సంస్థలను ఆకర్షించేలా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలను తయారు చేయడంలో చాలా దేశాల కన్నా భారత్ ముందు ఉందని, ఈ విషయంలో ఎ లేదా ఏప్లస్ రేటింగ్ ఇవ్వొచ్చని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం 200 మంది పైచిలుకు సీఈవోలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. వైద్యం, ఇంధనం, సహజ వనరులు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలకు ఐటీ, టెక్నాలజీ పరిష్కారమార్గాలు చూపగలవని డెల్ అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement