తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు

Jio record growth in twin telugu states - Sakshi

సాక్షి, హైదరాబాద్ : టెలికాం రంగంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్ జియో తెలుగు రాష్ట్రాల్లో కూడా తన హావాను చాటుతోందని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. గడచిన ఏప్రిల్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ టెలికాం సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి) లో రిలయన్స్ జియో కొత్తగా 6 లక్షల మంది వినియోగదారులను చేర్చుకుని దూసుకుపోతోందని పేర్కొంది. 

జియో మినహా ఇతర ఆపరేటర్ల (ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, టాటా టెలీ) వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోవటం గమనార్హం.  తాజా పెరుగుదలతో ఏప్రిల్ చివరి నాటికి తెలుగు రాష్ట్రాల్లో జియో వినియోగదారుల సంఖ్య దాదాపు 2.5 కోట్లకి చేరుకుంది. 2019 ఏప్రిల్ కాలానికి టెలికాం అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్‌) విడుదల చేసిన తాజా నివేదిక లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం టెలికాం వినియోదారుల సంఖ్య ఏప్రిల్ చివరి నాటికి 118.37 కోట్లకి చేరుకుంది. జియోతో పాటు బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఈ నెలలో సుమారు 83  లక్షల మంది వినియోగదారులను దేశవ్యాప్తంగా జోడించాయి.


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top