ఏడు క్వార్టర్ల తర్వాత లాభాల్లోకి జెట్ ఎయిర్‌వేస్
దాదాపు ఏడు క్వార్టర్ల తర్వాత జెట్ ఎయిర్‌వేస్ లాభాల బాట పట్టింది. డిసెంబర్ క్వార్టర్‌కు రూ. 3 కోట్ల నికర లాభం ఆర్జించామని జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది.
న్యూఢిల్లీ: దాదాపు ఏడు క్వార్టర్ల తర్వాత జెట్ ఎయిర్‌వేస్ లాభాల బాట పట్టింది. డిసెంబర్ క్వార్టర్‌కు రూ. 3 కోట్ల నికర లాభం ఆర్జించామని జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.284 కోట్ల నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ క్రామర్ బాల్ చెప్పారు. స్టాండోలోన్ ప్రాతిపదికన ఈ క్యూ3లో రూ.63 కోట్ల నికర లాభం ఆర్జించామని, గత క్యూ3లో ఇది రూ.268 కోట్లని వివరించారు. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ బాగా పెరగడం, విమానయాన ఇంధనం ధర తగ్గడం వల్ల లాభాల బాట పట్టామని వివరించారు. మొత్తం ఆదాయం రూ.4,990 కోట్ల నుంచి రూ.5,436 కోట్లకు పెరిగిందని వివరించారు.


