breaking news
Kramer Ball
-
ఏడు క్వార్టర్ల తర్వాత లాభాల్లోకి జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: దాదాపు ఏడు క్వార్టర్ల తర్వాత జెట్ ఎయిర్వేస్ లాభాల బాట పట్టింది. డిసెంబర్ క్వార్టర్‌కు రూ. 3 కోట్ల నికర లాభం ఆర్జించామని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.284 కోట్ల నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ క్రామర్ బాల్ చెప్పారు. స్టాండోలోన్ ప్రాతిపదికన ఈ క్యూ3లో రూ.63 కోట్ల నికర లాభం ఆర్జించామని, గత క్యూ3లో ఇది రూ.268 కోట్లని వివరించారు. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ బాగా పెరగడం, విమానయాన ఇంధనం ధర తగ్గడం వల్ల లాభాల బాట పట్టామని వివరించారు. మొత్తం ఆదాయం రూ.4,990 కోట్ల నుంచి రూ.5,436 కోట్లకు పెరిగిందని వివరించారు. -
జెట్ ఎయిర్వేస్ నష్టం రూ. 4,129 కోట్లు
ముంబై: అధిక వ్యయాలు, నిర్వహణపరమైన సవాళ్ల నేపథ్యంలో గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2013-14) జెట్ ఎయిర్వేస్ రూ. 4,129 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధిక నష్టంకాగా, వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా లాభదాయకతను పెంచుకునేందుకు మూడేళ్ల బిజినెస్ ప్రణాళికకు తెరలేపింది. దీనిలో భాగంగా కొత్త సీఈవోగా క్రామర్ బాల్‌ను ఎంపిక చేసుకోవడంతోపాటు, బ్యాలన్స్ షీట్‌ను పటిష్టపరచడం, అధిక విలువగల ఆస్తులను విక్రయించడం, వ్యయాల పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలకు ఉపక్రమించింది. వీటితోపాటు విమాన సర్వీసులలో సైతం మార్పులు చేస్తూ డెరైక్టర్ల బోర్డు తీర్మానించింది. బోర్డు సమావేశానికి తొలిసారి అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జెట్ ఎయిర్వేస్లో 24% వాటాను ఈ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అంతక్రితం ఏడాది(2012-13)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 779 కోట్ల నష్టం నమోదైంది. జనవరి-మార్చి(క్యూ4) కాలానికి కూడా జెట్ ఎయిర్వేస్ రూ. 2,153 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. వెరసి వరుసగా ఐదో క్వార్టర్లో నష్టాలను నమోదు చేసుకుంది.


