మీ ఐటీఆర్‌ ఏ దశలో ఉంది?

ITR Status Available in Online Now - Sakshi

గత నెల 31తో ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు గడువు ముగిసింది. గడువులోపు రిటర్నులను ఆన్‌లైన్‌లో ఫైల్‌ చేసిన వారు, సంబంధిత ఐటీఆర్‌ ఏ దశలో ఉందో (స్టాటస్‌) తెలుసుకోవడం అవసరం. దీనివల్ల మీ ఐటీఆర్‌ ప్రాసెస్‌ అయిందా? లేక పన్ను చెల్లింపు దారు వైపు నుంచి తదుపరి చర్య ఏదైనా అవసరం ఉందా? అన్నది తెలుస్తుంది. మీ ఐటీఆర్‌ ఏ దశలో ఉందో తెలుసుకోవడం ఎంతో సులభం. ఈ ఫైలింగ్‌ పోర్టల్‌కు లాగిన్‌ అయిన తర్వాత ‘వ్యూ రిటర్న్స్‌/ఫామ్స్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే, దాఖలు చేసిన ఐటీఆర్‌ల జాబితా కనిపిస్తుంది. ‘రిటర్న్‌ అప్‌లోడెడ్, పెండింగ్‌ ఫర్‌ ఐటీఆర్‌వీ/ఈ వెరిఫికేషన్‌’ అని చూపిస్తే.. మీరు వెరిఫై చేసిన తర్వాతే మీ ఐటీఆర్‌ ప్రాసెస్‌కు వెళుతుందని అర్థం. మీ ఐటీఆర్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్‌ చేస్తే అక్కడే అదే కనిపిస్తుంది. ఇలా మీ ఐటీఆర్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top