టీచర్ ట్రైనింగ్ స్కిల్ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్ష‌ణ‌.. | Teacher Training skill courses In Online | Sakshi
Sakshi News home page

టీచర్ ట్రైనింగ్ స్కిల్ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్ష‌ణ‌..

Dec 9 2025 12:13 PM | Updated on Dec 9 2025 5:46 PM

Teacher Training skill courses In Online

కేంద్ర ప్రభుత్వ సంస్థ  ఆధ్వర్యంలో  నేషనల్ స్కిల్ అకాడమీ  ద్వారా మహిళలకు మాంటెస్సోరి, ప్రీ-ప్రైమరీ, నర్సరీ టీచర్, కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ స్కిల్ కోర్సులలో ఆన్‌లైన్‌ శిక్ష‌ణ‌ ఇవ్వనుంది. శిక్షణ కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  ఈ కోర్సులకు  తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలలోని అన్ని నగరాలు, పట్టణాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోని  ఇంటర్ పాస్, డిగ్రీ, పీజీ  విద్యార్థినిలు, మహిళలు ఎవరైనా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చును.

దరఖాస్తుదారులు ఉపాధి అవకాశాలు గల స్కిల్ డెవలప్మెంట్ ప్రీ-ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సు,  మాంటెస్సోరి  టీచర్ ట్రైనింగ్ కోర్సు, నర్సరీ టీచర్  ట్రైనింగ్  మరియు కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్   కోర్సులలో  ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. కోర్సులు ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అయిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆమోదించిన సంస్థచే సర్టిఫికేట్‌ను అందుకుంటారు.

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్తులకు   మాంటెస్సోరి,  ప్రీ-ప్రైమరీ, నర్సరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు ప్రైవేట్ ప్రీ-స్కూల్స్, ప్లే స్కూల్స్,  ఇంటర్నేషనల్  ప్రీ-స్కూల్స్ లలో  మాంటెస్సోరి ,  ప్రీ-ప్రైమరీ, నర్సరీ  టీచర్లు గా  ఉపాధి  అవకాశాలు కలవు.  కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్తులకు   ప్రైవేట్ స్కూల్స్ లలో కంప్యూటర్  టీచర్లు గా  ఉపాధి  అవకాశాలు కలవు.

భారతదేశంలో ప్రీ-స్కూల్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది, ఎందుకంటే ప్రీ-స్కూల్ విద్యలో పెరుగుతున్న పెట్టుబడి మరియు ఆవిష్కరణల కారణంగా, 2030 నాటికి 2 మిలియన్ల ప్రీ-స్కూల్ ఉద్యోగాలు అంచనా వేయబడ్డాయి. నాణ్యమైన విద్య, సాంకేతిక ఏకీకరణ మరియు ఫ్రాంచైజ్ నమూనాలు ఈ వృద్ధికి కీలకమైనవి, ముఖ్యంగా ప్రధాన నగరాలు, జిల్లాలు మరియు ప్రధాన పట్టణాలలో కూడా మహిళలకు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి
ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement