breaking news
National Skill Development Mission
-
టీచర్ ట్రైనింగ్ స్కిల్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ..
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ అకాడమీ ద్వారా మహిళలకు మాంటెస్సోరి, ప్రీ-ప్రైమరీ, నర్సరీ టీచర్, కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ స్కిల్ కోర్సులలో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ కోసం ఆన్ లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సులకు తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలలోని అన్ని నగరాలు, పట్టణాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోని ఇంటర్ పాస్, డిగ్రీ, పీజీ విద్యార్థినిలు, మహిళలు ఎవరైనా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చును.దరఖాస్తుదారులు ఉపాధి అవకాశాలు గల స్కిల్ డెవలప్మెంట్ ప్రీ-ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సు, మాంటెస్సోరి టీచర్ ట్రైనింగ్ కోర్సు, నర్సరీ టీచర్ ట్రైనింగ్ మరియు కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ కోర్సులలో ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. కోర్సులు ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అయిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆమోదించిన సంస్థచే సర్టిఫికేట్ను అందుకుంటారు.శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్తులకు మాంటెస్సోరి, ప్రీ-ప్రైమరీ, నర్సరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు ప్రైవేట్ ప్రీ-స్కూల్స్, ప్లే స్కూల్స్, ఇంటర్నేషనల్ ప్రీ-స్కూల్స్ లలో మాంటెస్సోరి , ప్రీ-ప్రైమరీ, నర్సరీ టీచర్లు గా ఉపాధి అవకాశాలు కలవు. కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్తులకు ప్రైవేట్ స్కూల్స్ లలో కంప్యూటర్ టీచర్లు గా ఉపాధి అవకాశాలు కలవు.భారతదేశంలో ప్రీ-స్కూల్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది, ఎందుకంటే ప్రీ-స్కూల్ విద్యలో పెరుగుతున్న పెట్టుబడి మరియు ఆవిష్కరణల కారణంగా, 2030 నాటికి 2 మిలియన్ల ప్రీ-స్కూల్ ఉద్యోగాలు అంచనా వేయబడ్డాయి. నాణ్యమైన విద్య, సాంకేతిక ఏకీకరణ మరియు ఫ్రాంచైజ్ నమూనాలు ఈ వృద్ధికి కీలకమైనవి, ముఖ్యంగా ప్రధాన నగరాలు, జిల్లాలు మరియు ప్రధాన పట్టణాలలో కూడా మహిళలకు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయిఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. -
స్కిల్ ఇండియా మిషన్ నిధులు గోల్మాల్
హైదరాబాద్ : ప్రధాని స్కిల్ ఇండియా నిధులను దిల్సుఖ్నగర్ యూకో బ్యాంక్ అధికారులు గోల్మాల్ చేశారు. నల్లగొండ జయం ఇన్స్టిట్యూట్తో చేతులు కలిపిన బ్యాంక్ అధికారులు స్కిల్ ఇండియా నిధులను స్వాహా చేశారు. విద్యార్థులు పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి అందినకాడికి దండుకున్నారు. స్కిల్ ఇండియా నిధుల గోల్మాల్పై సీబీఐ అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 180మంది జయం ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు సీబీఐ నోటీసులు పంపింది. సీబీఐ నోటీసులతో అవాక్కైన విద్యార్థులు తమకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేస్తారంటూ దిల్సుఖ్నగర్ యూకో బ్యాంక్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. స్కిల్ ఇండియా పేరుతో విద్యార్థి ఖాతాలో ప్రతినెల రూ.10వేలు జమ కాగా, దాదాపు రూ.కోటికి పైగా స్కిల్ ఇండియా నిధులు స్వాహా చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ఘటనపై సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.


