ఇన్ఫోసిస్‌కు మరో కీలక అధికారి గుడ్‌బై

Infosys CFO Ranganath Steps Down - Sakshi

ముంబై : ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో కీలక అధికారి గుడ్‌బై చెప్పారు. కంపెనీ సీఎఫ్‌ఓగా పనిచేస్తున్న రంగనాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత తన పదవిలో నవంబర్‌ 16 వరకే కొనసాగనున్నారు. రంగనాథ్‌ రాజీనామాను ఇన్ఫోసిస్‌ బోర్డు కూడా ఆమోదించింది. వెంటనే కొత్త సీఎఫ్‌ఓను వెతుకులాటను కూడా ఇన్ఫోసిస్‌ బోర్డు చేపట్టబోతుంది. ‘18 ఏళ్లు సుదీర్ఘకాలం పాటు ఇన్ఫోసిస్‌లో పనిచేసిన రంగనాథ్‌, పలు బృందాలకు నాయకత్వం వహించారు. కన్సల్టింగ్‌, ఫైనాన్స్‌, స్ట్రాటజీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఎం అండ్‌ ఏ ఏరియాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బోర్డు, దాని కమిటీలతో కలిసి ఎంతో సన్నిహితంగా పనిచేశారు. వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేయడం ఈ పాత్ర చాలా కీలకం’ అని కంపెనీ తెలిపింది.  

ఈ ఏడాది ప్రారంభంలోనే రంగనాథ్‌ అమెరికా నుంచి బెంగళూరుకు సిఫ్ట్‌ అయ్యారు. సీఈవో సలీల్‌ పరేఖ్‌తో కలిసి పనిచేశారు. రంగనాథ్‌ కంపెనీకి అందించిన అద్భుతమైన సహకారానికి ఆయనకు కృతజ్ఞతలు ఇన్ఫోసిస్‌ బోర్డు చెబుతున్నట్టు బోర్డు సీఈవో నందన్‌ ఎన్‌ నిలేఖని చెప్పారు. ఆయన మరింత పైస్థాయికి ఎదగగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.గత మూడేళ్లలో సీఎఫ్‌ఓగా రంగా ఎంతో కీలకమైన సేవలందించినట్టు పేర్కొన్నారు. సమర్థవంతమైన మూలధన కేటాయింపుల పాలసీని ఆయన అవలంభించారని కొనియాడారు. 

15 ఏళ్లకు పైగా రంగనాథ్‌తో కలిసి పనిచేశా. దేశంలో అత్యున్నత సీఈవోల్లో రంగనాథ్‌ ఒకరు. ప్రతికూల పరిస్థితుల్లో కఠినతర నిర్ణయాలు తీసుకోవడంలో ఈయన దిట్ట. ఆర్థిక నిపుణుడైన రంగనాథ్‌, కంపెనీకి కీలక ఆస్తి - ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top