కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు

Indian Equity Markets Slipped Over Four Percent - Sakshi

ముంబై : స్టాక్‌మార్కెట్లను కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి మళ్లుతుందనే అంచనాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ బుధవారం 1300 పాయింట్లు పతనమై 30 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 328 పాయింట్లు కోల్పోయి 9000 పాయింట్ల దిగువన 8638 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఆరంభంలో లాభాల బాట పట్టిన స్టాక్‌మార్కెట్లు ఆ తర్వాత నెగెటివ్‌ జోన్‌లోకి వెళ్లాయి. 2020లో భారత జీడీపీ 5.2 శాతానికి పరిమితమవుతుందన్న ఎస్‌అండ్‌పీ అంచనాలు సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.

చదవండి : మళ్లీ అదేవరస : కుప్పకూలిన సూచీలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top