టాప్‌ 10 గ్లోబల్‌ సీఈఓల్లో మనోళ్లు..

Indian CEOs Got Top 10 Rankings Says Harvard Business Review - Sakshi

6వ స్థానంలో అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌

7, 9 ర్యాంకుల్లో అజయ్‌ బంగా, సత్య నాదెళ్ల

హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ(హెచ్‌బీఆర్‌) తాజా జాబితాలో వెల్లడి

న్యూయార్క్‌: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి 10 కంపెనీల చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ(హెచ్‌బీఆర్‌) రూపొందించిన ఈ ఏడాది టాప్‌–100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌ 6వ స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో మాస్టర్‌ కార్డ్‌ చీఫ్‌ అజయ్‌ బంగా ఉండడం విశేషం. కాగా.. తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల 9వ ర్యాంకులో నిలిచారు. తొలి పది స్థానాల్లో ముగ్గురు భారత సంతతి వారు ఉండగా.. పూర్తి జాబితాలో డీబీఎస్‌ బ్యాంక్‌ పియూష్‌ గుప్తా 89వ స్థానంలో నిలిచి మొత్తం భారత సంతతి సంఖ్యను నాలుగుకు పెంచారు.

62వ స్థానంలో టిమ్‌కుక్‌ 
గ్లోబల్‌ టాప్‌ 100 జాబితాలో నైక్‌ సీఈఓ మార్క్‌ పార్కర్‌ (20), జేపీ మోర్గాన్‌ చీఫ్‌ జామీ డిమోన్‌ (23), లాక్‌హీడ్‌ మార్టిన్‌ సీఈఓ మారిలిన్‌ హ్యూసన్‌ (37), డిస్నీ సీఈఓ రాబర్ట్‌ (55), ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ (66), సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈఓ మసయోషి సన్‌ (96) ర్యాంకుల్లో ఉన్నారు. అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ అగ్రస్థానంలో నిలిచారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top