breaking news
harvard business review
-
టాప్ 10 గ్లోబల్ సీఈఓల్లో మనోళ్లు..
న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి 10 కంపెనీల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన ఈ ఏడాది టాప్–100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా ఉండడం విశేషం. కాగా.. తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9వ ర్యాంకులో నిలిచారు. తొలి పది స్థానాల్లో ముగ్గురు భారత సంతతి వారు ఉండగా.. పూర్తి జాబితాలో డీబీఎస్ బ్యాంక్ పియూష్ గుప్తా 89వ స్థానంలో నిలిచి మొత్తం భారత సంతతి సంఖ్యను నాలుగుకు పెంచారు. 62వ స్థానంలో టిమ్‌కుక్ గ్లోబల్ టాప్ 100 జాబితాలో నైక్ సీఈఓ మార్క్ పార్కర్ (20), జేపీ మోర్గాన్ చీఫ్ జామీ డిమోన్ (23), లాక్‌హీడ్ మార్టిన్ సీఈఓ మారిలిన్ హ్యూసన్ (37), డిస్నీ సీఈఓ రాబర్ట్ (55), ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (66), సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ (96) ర్యాంకుల్లో ఉన్నారు. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అగ్రస్థానంలో నిలిచారు. -
అత్యుత్తమ సీఈఓల్లో మాస్టర్‌కార్డ్ బంగా
* హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రపంచ టాప్-100 జాబితాలో 64వ ర్యాంక్ * భారత్ సంతతికి చెందిన ఎకైక వ్యక్తి... న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కంపెనీ సీఈఓల్లో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా చోటు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది టాప్-100 ప్రపంచ సీఈఓల్లో బంగా 64వ స్థానంలో నిలిచారు. అంతేకాదు.. భారత్‌లో జన్మించిన సీఈఓల్లో ఆయన ఒక్కరికి మాత్రమే ఈ జాబితాలో ర్యాంకు లభించడం విశేషం. దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలు సాధించడం, వాటాదారులకు మంచి రాబడులు, కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంపు వంటి నిర్దిష్ట అంశాలను ఇందుకు కొలమానంగా తీసుకున్నట్లు హెచ్‌బీఎస్ పేర్కొంది. 2010లో మాస్టర్‌కార్డ్ పగ్గాలను చేపట్టిన బంగా.. షేర్హోల్డర్లకు 169 శాతం లాభాలను అందించారని.. అదేవిధంగా కంపెనీ మార్కెట్ క్యాప్‌ను 66 బిలియన్ డాలర్ల మేర పెంచినట్లు తెలిపింది. కాగా, ర్యాం కింగ్స్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ జెఫ్రీ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో గిలీడ్ సెన్సైస్ సీఈఓ జాన్ మార్టిన్, సిస్కో సిస్టమ్స్ సీఈఓ జాన్ చాంబర్స్ రెండు, మూడు ర్యాంకులను చేజిక్కించుకున్నారు. ఇతర ముఖ్యాంశాలివీ.. * టాప్-100లో ఇద్దరు మహిళలకే చోటుదక్కింది. వెంటాస్ సీఈఓ డెబ్రా కఫారో(27), టీజేఎక్స్ చీఫ్ కరోల్ మేరోవిట్జ్(51) ఇందులో ఉన్నారు. * ర్యాంకింగ్స్‌లోని కంపెనీల్లో ఇతర దేశాలకు చెందిన సీఈఓలు 13 మంది ఉండగా.. వారిలో బంగా ఒకరు. టాప్-100 సీఈఓల్లో 29 మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. 24 మందికి ఇంజినీరింగ్‌లో అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నాయి. * ఇంజినీరింగ్ విద్య వల్ల ప్రాక్టికల్(ఆచరణాత్మక) దృక్పథం అలవడుతుందని.. ఇది ఎలాంటి కెరీర్‌లోనైనా చోదోడుగా నిలుస్తుందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోహ్రియా చెప్పారు. ముంబై ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన నోహ్రియా కూడా భారతీయుడే కావడం గమనార్హం.