జోరుగా రెమిటెన్సులు... | India received $34.9 billion in remittances between April-September | Sakshi
Sakshi News home page

జోరుగా రెమిటెన్సులు...

Feb 27 2015 2:29 AM | Updated on Sep 2 2017 9:58 PM

జోరుగా రెమిటెన్సులు...

జోరుగా రెమిటెన్సులు...

భారత్‌లోకి రెమిటెన్సెస్ జోరుగా వస్తున్నాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె. సింగ్ పేర్కొన్నారు.

ఆరు నెలల్లో 3,490 కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: భారత్‌లోకి రెమిటెన్సెస్ జోరుగా వస్తున్నాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె. సింగ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి 3,490 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్(విదేశాల్లో పనిచేస్తున్న స్వదేశీయులు తమ స్వదేశానికి పంపించే సొమ్ములు) వచ్చాయని రాజ్యసభకు ఆయన వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం  6,960 కోట్ల డాలర్ల రెమిటెన్సెస్ వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం అంతకంటే ఎక్కువగానే వస్తాయని తెలిపారు.

ప్రపంచంలో అందరి కంటే మనకే అధికంగా రెమిటెన్సెస్ వస్తున్నాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో  చైనాకు 6,000 కోట్ల డాలర్లు, ఫిలిప్పైన్స్‌కు 2,500 కోట్ల డాలర్లు చొప్పున వచ్చాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement