హాస్పిటల్‌ రంగంలోకి ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా | Incredible India Entry in Medical Service | Sakshi
Sakshi News home page

హాస్పిటల్‌ రంగంలోకి ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా

Aug 10 2019 12:54 PM | Updated on Aug 10 2019 12:54 PM

Incredible India Entry in Medical Service - Sakshi

రాంగోపాల్‌పేట్‌: రూ.100 కోట్లతో అస్సాంలోని గౌహతిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వచ్చే 2021 ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి వస్తుందని ఇన్‌క్రెడిబుల్‌ ఇండియ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సీవోవో ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌లు తెలిపారు. సికింద్రాబాద్‌ పార్క్‌లేన్‌లో ఈ గ్రూపు ఏర్పాటు చేసిన ఇన్‌క్రెడిబుల్‌ వన్‌ హోటల్‌ను వారు ప్రారంభించారు. గత ఏడాది ఆతిధ్య రంగంలోకి ప్రవేశించి లక్డీకపూల్‌లో హ్యాంప్‌షైర్‌ ప్లాజా, కొచ్చిలో రాడిసన్‌ బ్లూ పేరుతో ప్రారంభించామని ఇప్పుడు రూ.25 కోట్లతో పార్క్‌లేన్‌లో ఇన్‌క్రెడిబుల్‌ వన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.మ్యాన్‌ఫాక్చరింగ్‌ రంగంలోకి ప్రవేశించి రూ.60కోట్లతో పార్లీ సంస్థతో కలిసి యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌లో 3 ఎకరాల స్థలంలో బిస్కెట్, కేక్‌ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement