భారత్‌లో ఐఫోన్6 అమ్మకాలు షురూ | In India, sales of the iPhone 6 | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఐఫోన్6 అమ్మకాలు షురూ

Oct 18 2014 1:04 AM | Updated on Aug 20 2018 2:55 PM

భారత్‌లో ఐఫోన్6 అమ్మకాలు షురూ - Sakshi

భారత్‌లో ఐఫోన్6 అమ్మకాలు షురూ

యాపిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అమ్మకాలు భారత్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.

న్యూఢిల్లీ: యాపిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అమ్మకాలు భారత్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. 4.7 అంగుళాల స్క్రీన్ ఉండే ఐఫోన్ 6లో 16 జీబీ వెర్షన్ రేటు రూ. 53,500, 64 జీబీ వెర్షన్ ధర రూ. 62,500, 128 జీబీ ధర రూ. 71,500గా ఉంది. ఇక, 5.5 అంగుళాల స్క్రీన్ ఉండే ఐఫోన్ 6 ప్లస్‌లో 16 జీబీ వెర్షన్ రేటు రూ. 62,500, 64 జీబీ రేటు రూ. 71,500, 128 జీబీ వెర్షన్ ధర రూ. 80,500గా ఉంది. ఇవి సిల్వర్, గోల్డ్ తదితర రంగుల్లో లభిస్తాయి. పంపిణీదారులు, రిటైలర్ల కథనాల ప్రకారం దేశీయంగా సుమారు 25,000 పైచిలుకు ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు వ చ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement