తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచీలు | ICICI Bank Opens 57 Branches In Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచీలు

Nov 8 2019 5:49 AM | Updated on Nov 8 2019 5:49 AM

ICICI Bank Opens 57 Branches In Andhra Pradesh And Telangana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని  ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని.. వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223, ఏటీఎంలు 1,580 ఉన్నాయని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement