హువావే హానర్ 10ఐ స్మార్ట్‌ఫోన్ | Honor 10i Launched in Russia | Sakshi
Sakshi News home page

హువావే హానర్ 10ఐ స్మార్ట్‌ఫోన్

Mar 21 2019 1:50 PM | Updated on Mar 21 2019 1:50 PM

Honor 10i Launched in Russia - Sakshi

చైనా  స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హువావే  నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను  రష్యాలో లాంచ్‌ చేసింది. ఎంట్రీ లెవర్‌ సెగ్మెంట్‌లో బడ్జెట్‌ ధరలో హానర్ 10ఐ ని విడుద‌ల చేసింది.  వీటితో పాటు నోవా 4 ఇ, పి స్మార్ట్‌  ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను కూడా పరిచయం చేసింది. 3డీ,గ్రాడియంట్‌ ఫినిష్‌,  ట్రిపుల్‌ కెమెరా, వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా ఉంది. అయితే ధరను ఇంకా రివీల్‌ చేయలేదు.  

హాన‌ర్ 10ఐ ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 9.0 పై
2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌
 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
 24 + 2+8 ఎంపీ ట్రిపుల్  రియర్‌ కెమెరా
 32  ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement
 
Advertisement
Advertisement