అంచనాలను అందుకోలేని హెచ్ సీఎల్ | HCL Tech Q3 below estimates; net up 0.3%, $ revenue up 1.3% | Sakshi
Sakshi News home page

అంచనాలను అందుకోలేని హెచ్ సీఎల్

Apr 28 2016 4:46 PM | Updated on Sep 3 2017 10:58 PM

భారత బహుళ జాతి టెక్నాలజీ సంస్థ హెచ్ సీఎల్ ఈ త్రైమాసింకంలో మార్కెట్ నిపుణుల అంచనాలను అందుకోలేకపోయింది.

భారత బహుళ జాతి టెక్నాలజీ సంస్థ హెచ్ సీఎల్ ఈ త్రైమాసింకంలో మార్కెట్ నిపుణుల అంచనాలను అందుకోలేకపోయింది. వారి అంచనాలను తాకలేక జనవరి-మార్చి త్రైమాసికంలో కేవలం 0.3శాతం నికర ఆదాయాలనే నమోదుచేసింది. క్యూ3లో రూ.1,939 కోట్లగా ఉంటాయనుకున్న నికరలాభాలను రూ. 1926 కోట్లగానే కంపెనీ ఫలితాలు చూపించాయి. అంచనాలకు కిందగానే అమ్మకాలను సైతం రూ.10,698 కోట్లగా నమోదుచేశాయి. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల రెవెన్యూ వృద్ధి కంటే తక్కువగా కేవలం 11.6శాతం రెవెన్యూ వృద్దినే హెచ్ సీఎల్ చూపించింది. హెచ్ సీఎల్ గురువారం(నేడు) ఆశించిదగ్గ ఫలితాలను విడుదల చేయకపోవడంతో, మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు 5శాతం మేర పడిపోయాయి. బీసీఎస్ ఈ సెన్సెక్స్ లో రూ.799.30 వద్ద నమోదైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ట్రేడింగ్ లో  టాప్ లూజర్ నమోదైన హెచ్ సీఎల్ 1.4 శాతం పడిపోయింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement