న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 3 శాతం తగ్గింది. నికర లాభం తగ్గినా, రానున్న క్వార్టర్లలో మంచి పనితీరు సాధించగలమన్న ధీమాను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యక్తం చేసింది. గత క్యూ2లో రూ.1,873 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,823 కోట్లకు తగ్గిందని కంపెనీ సీఎఫ్‌ఓ అనిల్ చనన చెప్పారు. ఆదాయం(కన్సాలిడేటెడ్) రూ.8,735 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.10,097 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
డాలర్ ప్రాతిపదికన నికర లాభం 31 కోట్ల డాలర్ల నుంచి 9 శాతం క్షీణించి 28 కోట్ల డాలర్లకు పడిపోయిందని తెలిపారు. ఆదాయం మాత్రం 143 కోట్ల డాలర్ల నుంచి 8 శాతం వృద్ధితో 154 కోట్లకు పెరిగిందని తెలిపారు.
గత కొన్ని క్వార్టర్లలో ప్రపంచ వ్యాప్తంగా డెవలప్‌మెంట్ సెంటర్లు, కొలాబరేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం పెట్టుబడులు పెట్టడం, ప్రతిభ గల సీనియర్ ఉద్యోగులను తీసుకోవడం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీలపై పెట్టుబడుల కారణంగా నికర లాభం తగ్గిందని, వీటి కోసం గత కొన్ని క్వార్టర్లలో రూ.1,300 కోట్లు ఇన్వెస్ట్ చేశామని అనిల్ చెప్పారు. బియాండిజిటల్, నెక్స్‌ట్-జెన్ ఐటీఓ, ఐఓటీలపై ఇన్వెస్ట్‌మెంట్స్ రానున్న క్వార్టర్లలో మంచి ఫలితాలనివ్వనున్నాయని వివరించారు.
యూరప్‌లో మంచి డీల్స్ సాధించామని, ఈ ఫలితాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో కనిపిస్తాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ అనంత్ గుప్తా చెప్పారు. ఈ క్యూ2లో కంపెనీ 536 మంది ఉద్యోగులను తొల గించింది. దీంతో సిబ్బంది సంఖ్య 1,05,571కు తగ్గింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.777 కోట్ల వరకూ ఉన్నాయి.
బెంగళూరు కంపెనీ కొనుగోలు
బెంగళూరుకు చెందిన కాన్సెప్ట్ టు సిలికాన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చేశామని, ఫలితంగా సెమి కండక్టర్, ఇండస్ట్రియల్ ఐఓటీ ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేయడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది. డీల్ విలువ కోటి డాలర్ల కంటే తక్కువగానే ఉందని పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 1.23 శాతం వృద్ధితో రూ.852కు పెరిగింది.
హెచ్‌సీఎల్ టెక్ లాభం 3% డౌన్
Published Tue, Oct 20 2015 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement