జీఎస్‌టీ పరిధిలోకి గ్యాస్‌..? | GST Council To Discuss Bringing Natural Gas Under GST | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ పరిధిలోకి గ్యాస్‌..?

Jun 8 2018 6:17 PM | Updated on Jun 8 2018 6:17 PM

GST Council To Discuss Bringing Natural Gas Under GST - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సహజవాయువును జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జీఎస్‌టీ కౌన్సిల్‌ తదుపరి సమావేశంలో ప్రయోగాత్మక  ప్రతిపాదనను చర్చించనుందని  జీఎస్‌టీ జాయింట్ సెక్రటరీ ధీరజ్ రాస్తోగి  శుక్రవారం వెల్లడించారు. జీఎస్‌టీ వర్క్‌షాపులో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ముడి చమురు, సహజ వాయువు, విమానయాన ఇంధనం, డీజిల్, పెట్రోల్‌ లాంటి ఐదు వస్తువులను జీఎస్‌టీ పరిధిలోకి తేనున్నామన్నారు.

ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్) సహా అయిదు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నామని ధీరజ్ రస్తోగి  ప్రకటించారు. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నాటికి ఇందులో లాభనష్టాలను బేరీజు వేసుకుని కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ముందుగా పెట్రోల్‌ను  జీఎస్‌టీ పరిధిలోకి తీసుకు వచ్చేఅవకాశం ఉందన్నారు. అయితే ఈ  పక్రియ అమలుకు ఏలాంటి గడువును ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు రావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  దీంతో గ్యాస్‌​ ధర తగ్గే అవకాశముందనీ, త్వరలోనే ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశముందని  భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement