పెళ్లి నగలు కొనేవారికి భారీ ఊరట | Sakshi
Sakshi News home page

పెళ్లి నగలు కొనేవారికి భారీ ఊరట

Published Tue, May 31 2016 12:19 PM

పెళ్లి నగలు కొనేవారికి  భారీ ఊరట

 ముంబై: బంగారు  ఆభరణాలపై 1 శాతం పన్ను విధింపులో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 42 రోజులు పాటు  బంగారు వర్తకుల దేశవ్యాప్త సమ్మెతో దిగి వచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ వ్యతిరేకంగా  పరిశ్రమ మొత్తం విస్తృతంగా సమ్మెలు చేపట్టిన ససేమిరా అన్న ప్రభుత్వం  ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది.  బంగారం లావాదేవీలపై విధించిన పన్నుపై అటు ప్రజలు, ఇటు ఆభరణాల వ్యాపారులు నుంచీ తీవ్ర వ్యతిరేకత  వెల్లువెత్తడంతో , ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం రేపటి నుంచి (జూన్ 1) అమలులోకి వస్తుందని ప్రకటించింది.  దీంతో స్టాక్ మార్కెట్లో  ఆభరణాల షేర్లన్నీ లాభాల బాట పట్టాయి.

 ఈ  ఆర్థిక   బడ్జెట్ లో   జూన్ 1వ తేదీనుంచి  బంగారంతో తయారు చేసిన ఆభరణాలు, బంగారు నాణేల  కొనుగోళ్లపై ఒక శాతం టాక్స్ ను  ప్రభుత్వం ప్రదిపాదించింది.  ఫైనాన్స్ బిల్లు ప్రకారం నగదు ద్వారా ఎవరైతే వినియోగదారులు 2 లక్షలకు మించి బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణేలను కొనుగోలు చేస్తారో వారి నుండి టీసీఎస్ (సోర్స్ వద్ద పన్ను సేకరణ) రూపంలో ఒక శాతం పన్ను వసూలు చేయనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  ప్రతిపాదించారు.  వెండి మినహా మిగతా అన్ని రకాల విలువైన లోహాలతో తయారైన ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ, బడ్జెట్ లో ప్రతిపాదించగా దీనిపై  సర్వత్రా నిరసన వ్యక్తమైంది. బంగారు దుకాణదారులు దేశవ్యాప్త  సమ్మెకు దిగారు.     తమ వ్యాపారాన్ని దెబ్బతీసే పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ ఉద్యమంలో తీవ్ర నష్టాలను చవి చూడడంతో  ఏప్రిల్ లో పాక్షికంగా ఉద్యమాన్ని విరమించారు.

అటు  టైటాన్ షేర్లు 4 శాతం  లాభపడగా,  గీతాంజలి,  పీసీ జ్యువెల్లర్, త్రిభువన్ దాస్ జువేరీ,  శ్రీ గణేష్ లాంటి ఆభరణాలు  షేర్లు  లాభాల్లో ట్రేడవుతున్నాయి.  దీనిపై ఆల్ ఇండియా జెమ్స్  అండ్ జ్యువెల్లరీ ఫెడరేషన్ అధ్యక్షుడు బచిరాజ్ బామల్వా సంతోషం వ్యక్తం చేశారు.  పెళ్లి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇంచి పెద్ద ఊరట అని వ్యాఖ్యానించారు.   ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ డిమాండ్ ఉందనీ, జూన్ లో పెళ్లిళ్ల సీజన్ రాబోతున్న తరుణంలో రూ .5 లక్షల వరకు పరిమితి పెరగడం  పెద్ద రిలీఫ్ అని   మరో ప్రతినిధి గాడ్గిల్   పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement