breaking news
cash purchase
-
రూ.2లక్షలకుపైన నగదు కొనుగోళ్లపై ఊరట
న్యూఢిల్లీ: నగదు చెల్లింపు ద్వారా కొనుగోళ్లపై విధించిన మూలాధార పన్ను (టీసీఎస్)పై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆభరణాలు సహా, ఇతర సేవలకుగాను వస్తువులు కొనుగోళ్లపై ఆంక్షలను ఎత్తివేసింది. రూ.2 లక్షలకు మించి జరిపే కొనుగోళ్ళపై 1 శాతం మూలాధార పన్నును తొలగించింది. 2017-18 బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ ఒక శాతం టీసీఎస్‌ను తాజా కేంద్రం ‘ఆర్థిక బిల్లు 2017‘ ఆమోదం సందర్భంగా రద్దు చేసింది. ఇటీవల రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ 2017-18 బడ్జెట్లో ప్రతిపాదించిన కేంద్రం ఈ పరిమితిని రూ. 2 లక్షలకు కుదించింది. అయితే రెండు లక్షలకు మించిన నగదు కొనుగోళ్లపై పన్నును రద్దు చేసింది. ఆభరణాలు సహా వస్తువులు, ఇతర సేవలపై టీసీఎస్‌ను ఆర్థిక బిల్లు 2017 కు సవరణ ద్వారా తొలగించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు చట్ట సవరణలకు లోకసభలో బుధవారం ఆమోదించారు. ఆదాయం పన్ను శాఖ 1 జూలై 1, 2012 నుంచి బులియన్ నగదు కొనుగోళ్లు రూ. 2లక్షలకుమించితే, ఆభరణాల కొనుగోలు రూ.5 లక్షలు మించితే 1 శాతం టిసిఎస్ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
పెళ్లి నగలు కొనేవారికి భారీ ఊరట
ముంబై: బంగారు ఆభరణాలపై 1 శాతం పన్ను విధింపులో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 42 రోజులు పాటు బంగారు వర్తకుల దేశవ్యాప్త సమ్మెతో దిగి వచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ వ్యతిరేకంగా పరిశ్రమ మొత్తం విస్తృతంగా సమ్మెలు చేపట్టిన ససేమిరా అన్న ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. బంగారం లావాదేవీలపై విధించిన పన్నుపై అటు ప్రజలు, ఇటు ఆభరణాల వ్యాపారులు నుంచీ తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో , ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం రేపటి నుంచి (జూన్ 1) అమలులోకి వస్తుందని ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్లో ఆభరణాల షేర్లన్నీ లాభాల బాట పట్టాయి. ఈ ఆర్థిక బడ్జెట్ లో జూన్ 1వ తేదీనుంచి బంగారంతో తయారు చేసిన ఆభరణాలు, బంగారు నాణేల కొనుగోళ్లపై ఒక శాతం టాక్స్ ను ప్రభుత్వం ప్రదిపాదించింది. ఫైనాన్స్ బిల్లు ప్రకారం నగదు ద్వారా ఎవరైతే వినియోగదారులు 2 లక్షలకు మించి బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణేలను కొనుగోలు చేస్తారో వారి నుండి టీసీఎస్ (సోర్స్ వద్ద పన్ను సేకరణ) రూపంలో ఒక శాతం పన్ను వసూలు చేయనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. వెండి మినహా మిగతా అన్ని రకాల విలువైన లోహాలతో తయారైన ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ, బడ్జెట్ లో ప్రతిపాదించగా దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. బంగారు దుకాణదారులు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. తమ వ్యాపారాన్ని దెబ్బతీసే పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ ఉద్యమంలో తీవ్ర నష్టాలను చవి చూడడంతో ఏప్రిల్ లో పాక్షికంగా ఉద్యమాన్ని విరమించారు. అటు టైటాన్ షేర్లు 4 శాతం లాభపడగా, గీతాంజలి, పీసీ జ్యువెల్లర్, త్రిభువన్ దాస్ జువేరీ, శ్రీ గణేష్ లాంటి ఆభరణాలు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దీనిపై ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఫెడరేషన్ అధ్యక్షుడు బచిరాజ్ బామల్వా సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇంచి పెద్ద ఊరట అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ డిమాండ్ ఉందనీ, జూన్ లో పెళ్లిళ్ల సీజన్ రాబోతున్న తరుణంలో రూ .5 లక్షల వరకు పరిమితి పెరగడం పెద్ద రిలీఫ్ అని మరో ప్రతినిధి గాడ్గిల్ పేర్కొన్నారు.