ఏటీఎఫ్‌పై తగ్గిన  ఎక్సైజ్‌ డ్యూటీ  | Government cuts excise duty on Aviation Turbine Fuel to 11 per cent from 14 per cent | Sakshi
Sakshi News home page

ఏటీఎఫ్‌పై తగ్గిన  ఎక్సైజ్‌ డ్యూటీ 

Oct 11 2018 12:45 AM | Updated on Oct 11 2018 12:45 AM

Government cuts excise duty on Aviation Turbine Fuel to 11 per cent from 14 per cent   - Sakshi

న్యూఢిల్లీ: ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విమాన ఇంధనంగా పిలిచే ఏటీఎఫ్‌పై డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించిన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా తగ్గింపు అక్టోబరు 11 (గురువారం) నుంచి అమల్లోకి రానుంది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటరు ఏటీఎఫ్‌ ధర రూ.74.56 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది జులై నుంచి ఇప్పటివరకు విమాన ఇంధన ధర 58.6 శాతం పెరిగింది.    

Advertisement
 
Advertisement
Advertisement