
వచ్చే సమీక్షా సమావేశంలో మరోమారు ఆర్‌బీఐ ఇంకో పావుశాతం రేట్లను తగ్గించే ఛాన్సులున్నాయని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. ఆర్‌బీఐ ధోరణి మరో రేట్‌కట్‌కు అనుకూలంగా ఉందని, ఇందుకు ద్రవ్యోల్బణం దిగిరావడం వీలు కల్పిస్తోందని సీఎల్‌ఎస్‌ఏ ఒక నివేదికలో అభిప్రాయపడింది. వచ్చే నెలల్లో 25– 50 శాతం వరకు ఆర్‌బీఐ రేట్లను తగ్గించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఫైనాన్షియల్స్ ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీలను సిఫార్సు చేసింది.
మరో పావు శాతం రేట్ కట్ వచ్చే సమావేశంలో ఉండొచ్చని సిటీ గ్రూప్ పేర్కొంది. అయితే భారీ కోతల వాతావరణం ఇంకా రాలేదని, ద్రవ్యోల్బణం డౌన్‌సైడ్‌లో అనూహ్యం ఆశ్చర్యపరిస్తే అప్పుడు రేట్లలో భారీ కోతలుంటాయని తెలిపింది. మరో దఫా 25 శాతం రేట్లను తగ్గించాక ఆర్‌బీఐ వేచిచూసే మూడ్‌లోకి మారవచ్చని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వృద్ది, ద్రవ్యోల్బణం ప్రస్తుతానికి దిగువ స్థాయిలో ఉన్నా, క్రమంగా పెరగవచ్చని తెలిపింది. సంవత్సరాంతానికి జీడీపీ 7 శాతానికి రావచ్చని తెలిపింది.