ర్యాలీకి బ్రేక్‌ : తగ్గిన బంగారం ధరలు | Gold prices drop by Rs250, silver below Rs41,000 | Sakshi
Sakshi News home page

ర్యాలీకి బ్రేక్‌ : తగ్గిన బంగారం ధరలు

Jan 27 2018 6:40 PM | Updated on Jan 27 2018 6:40 PM

Gold prices drop by Rs250, silver below Rs41,000 - Sakshi

న్యూఢిల్లీ : రాబోతున్న పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పైపైకి ఎగుస్తూ వచ్చిన బంగారం ధరలు, నేడు పతనబాట పట్టాయి. స్థానిక ఆభరణ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతో పాటు, అంతర్జాతీయంగా పరిస్థితుల ప్రభావం స్తబ్దుగా ఉండటం వల్ల మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గినట్టు  బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. నేడు(శనివారం) బులియ‌న్ మార్కెట్లో ప‌ది గ్రాముల‌ బంగారం ధర 250 రూపాయలు తగ్గి, రూ.31,200గా న‌మోదైంది.

అయితే, గ్లోబ‌ల్ మార్కెట్లో మాత్రం 0.15 శాతం పెరిగి ఔన్సు ధర 1,349.30 డాలర్లకు చేరింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున పెరిగి రూ.31,200, రూ.31,050గా నమోదయ్యాయి. కాగ, కిలో వెండి ధ‌ర రూ. 350 తగ్గడంతో నేటి మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 40,650గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోయాయ‌ని విశ్లేష‌కులు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement