రూపాయి 29 నెలల కనిష్టం | Global stocks, dollar fall as oil sell-off resumes | Sakshi
Sakshi News home page

రూపాయి 29 నెలల కనిష్టం

Jan 28 2016 12:42 AM | Updated on Sep 3 2017 4:25 PM

రూపాయి 29 నెలల కనిష్టం

రూపాయి 29 నెలల కనిష్టం

డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం 29 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

రెండు ట్రేడింగ్ సెషన్లలో 42 పైసలు నష్టం
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ  బుధవారం 29 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. బ్యాంకులు, దిగుమతిదారులు ముఖ్యంగా ముడి చమురు రిఫైనరీ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్ బాగా ఉండటంతో రూపాయి బుధవారం నాడు మరో 22 పైసలు(0.32 శాతం) నష్టపోయింది.

ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం నాటి ముగింపు(67.83)తో పోల్చితే నష్టాలతో 67.90 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 68.08 కనిష్టానికి పడిపోయి చివరకు 68.05 వద్ద ముగిసింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి మొత్తం 42 పైసలు నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో అమ్మకాలను కొనసాగిస్తుండడం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని నిపుణులంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement