బంగారం ధరలు జంప్.. అసలు కారణాలివే! | Gold Rises As Dollar Oil Prices Ease Investors Eye Fed Rate Trajectory | Sakshi
Sakshi News home page

బంగారం ధరలు జంప్.. అసలు కారణాలివే!

Oct 9 2026 5:33 PM | Updated on Oct 9 2026 5:47 PM

Gold Rises As Dollar Oil Prices Ease Investors Eye Fed Rate Trajectory

అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ రేట్లు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు.. ఈ కథనంలో తెలుసుకుందాం.

డాలర్ బలహీనపడటం
సాధారణంగా అమెరికా డాలర్ విలువ తగ్గినప్పుడు.. ఇతర దేశాల పెట్టుబడిదారులకు బంగారం కొనడం కొంత చౌకగా మారుతుంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం పెరిగి ఔన్సుకు 4,187.65 డాలర్లకు చేరగా, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 1.3 శాతం పెరిగి 4,212.51 డాలర్లకు చేరింది.

చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేయబోమని ప్రకటించినట్లు సమాచారం. దీంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు కొంత తగ్గి చమురు ధరలు దిగివచ్చాయి.

చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి కొంత తగ్గవచ్చు. అప్పుడు.. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత పెంచాల్సిన అవసరం తగ్గవచ్చు. వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు తగ్గితే.. బంగారంపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ధరలు పెరుగుతాయి.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు
మరో ముఖ్యమైన విషయం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని నియంత్రించడానికి అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు మార్కెట్‌లో ఉన్నాయి. సెయింట్ లూయిస్ ఫెడ్ అధ్యక్షుడు అల్బెర్టో ముసాలెమ్ కూడా ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి తీసుకురావడానికి భవిష్యత్తులో వడ్డీ రేట్లను మరింత పెంచాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు.

వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలలో మార్పులు కనిపిస్తాయి. ఎందుకంటే బంగారంపై ఎలాంటి వడ్డీ ఆదాయం రాదు. అదే వడ్డీ వచ్చే బాండ్లు వంటి పెట్టుబడులపై రాబడి పెరిగితే, కొంతమంది పెట్టుబడిదారులు బంగారం కంటే వాటిపై ఆసక్తి చూపుతారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. అదే వడ్డీ రేట్లు తగ్గితే.. పసిడికి డిమాండ్ పెరుగుతుంది.

సీఎమ్ఈ ఫెడ్‌వాచ్ అంచనా
సీఎమ్ఈ ఫెడ్‌వాచ్ అంచనాల ప్రకారం.. అక్టోబర్‌లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం 18 శాతంగా ఉండగా, డిసెంబర్‌లో పెంచే అవకాశం 82 శాతంగా ఉందని సమాచారం. అయితే ఇవి మార్కెట్ అంచనాలు మాత్రమే, ఫెడ్ తీసుకున్న అధికారిక నిర్ణయాలు భవిష్యత్తులో తెలుస్తాయి.

భారతదేశంలో నేటి బంగారం ధరలు
ఇండియన్ మార్కెట్లో కూడా ఈ రోజు (శుక్రవారం) పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1140 రూపాయలు పెరిగి రూ.1,50,710 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1050 పెరిగి రూ.1,38,150 వద్దకు చేరింది. గోల్డ్ రేటు ఏ నగరంలో ఎలా ఉందో ఈ కింద చూడండి.

ఇదీ చదవండి: అందుకే.. అమెరికా విడిచి వచ్చేయండి!

నేటి బంగారం ధరలు1
1/4

నేటి బంగారం ధరలు2
2/4

నేటి బంగారం ధరలు3
3/4

నేటి బంగారం ధరలు4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement