జియోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రభాస్‌ | Gionee India ropes in Bahubali's Prabhas as brand ambassador | Sakshi
Sakshi News home page

జియోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రభాస్‌

Jun 6 2017 12:41 PM | Updated on Sep 5 2017 12:57 PM

జియోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రభాస్‌

జియోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రభాస్‌

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌..

న్యూఢిల్లీ: బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌.. మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘జియోనీ ఇండియా’కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. కంపెనీ తాజాగా ప్రభాస్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోనీ ఇప్పటికే క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్, ప్రముఖ కథానాయిక శృతిహాసన్, దుల్కర్‌ సల్మాన్, దిల్జిత్‌ దోశాంజ్‌ వంటి వారితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

‘ప్రభాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది. తాజా నిర్ణయంతో దేశంలో తమ స్థానం మరింత పదిలమవుతుందని ఆశిస్తున్నాం’ అని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అర్వింద్‌ ఆర్‌ వోహ్ర తెలిపారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఐదేశ్లలోనే 1.25 కోట్ల మంది యూజర్లను పొందామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement