ఫ్లిప్‌కార్ట్‌ ఆపిల్‌ వీక్‌ : ఐఫోన్లపై బెస్ట్‌ డీల్స్‌

Flipkarts Apple Week: Top deals on iPhone X, iPhone 7, MacBook Air and more - Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఆపిల్‌ వీక్‌ను ప్రారంభించింది. ఈ వీక్‌లో భాగంగా ఆపిల్‌ ఉత్పత్తులు ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, వాచ్‌లపై బెస్ట్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. డిస్కౌంట్లతో పాటు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపిన వారికి 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. 
 

బెస్ట్‌ డీల్స్‌ ఇవే...
ఐఫోన్‌ ఎక్స్ : ఆపిల్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ఒరిజినల్‌ ధర 89వేల రూపాయలు. అదేవిధంగా 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,02,000. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై కొనుగోలుదారులు 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంతేకాక రూ.18వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ : 
 ఐఫోన్‌ 8(64జీబీ) ధర 64వేల రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై 9వేల రూపాయల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. అదేవిధంగా ఐఫోన్‌ 8 ప్లస్‌(64జీబీ) ధరను 73వేల రూపాయల నుంచి 66,499 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్‌ తగ్గించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై కూడా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులపై 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. అదేవిధంగా 18వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌ : 
59వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్‌ 7 ప్లస్‌(32జీబీ) స్మార్ట్‌ఫోన్‌ ధరను ఫ్లిప్‌కార్ట్‌ 56,999 రూపాయలకు తగ్గించింది.  ఐఫోన్‌ 7 ధర కూడా 49వేల రూపాయల నుంచి 42,999 రూపాయలకు తగ్గింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఈఎంఐ లావాదేవీలపై 5వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందుతారు. ఎక్స్చేంజ్‌ ఆఫర్ల కింద ఐఫోన్‌ 7,  21వేల రూపాయల తగ్గింపుతో లిస్ట్‌ అయింది.
ఇలా ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌, ఐఫ్యాడ్‌ ప్రొ, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 2లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top