దిగ్గజాలకు షాక్‌: ఫోన్‌ పేలో భారీ పెట్టుబడులు

Flipkart dials Rs. 518 cr. into PhonePe - Sakshi

సాక్షి,ముంబై:  డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేకు  మాతృసంస్థ నుంచి భారీ నిధులు సమకూరాయి. ఆన్‌లైన్‌ రిటైల్ మేజర్ ఫ్లిప్‌కార్ట్‌ ఫోన్‌ పేకు రూ. 518 కోట్ల నిధులను  అందించింది.  డిజిటల్‌  పేమెంట్స్‌కు  దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ ఈ చర్య తీసుకుంది.  తద్వారా దేశంలో టాప్‌ కంపెనీగా ఎదగాలని  పథకాలు రచిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థులు గూగుల్‌ తేజ్‌  పేటీఎం, అమెజాన్‌  పే లాంటి దిగ్గజ సంస్థలకు షాకిచ్చేలా  ఈ నిర్ణయం తీసుకుంది.

సింగపూర్‌కు చెందిన పేరెంట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌  పే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (సిఆర్‌సీ) తో దాఖలు చేసిన తాజా రెగ్యులేటరీ డాక్యుమెంట్ల ప్రకారం 518 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ తాజా క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ మార్చి 19 న జరిగింది. రాబోయే సంవత్సరాల్లో  తన చెల్లింపుల వ్యాపారం కోసం  ఈ పెట్టుబడులను వెచ్చించినట్టు ఫోన్‌ పే తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top