రూ.13 వేల కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలకు ఓకే | FIPB clears FDI proposals worth Rs 13000 crore, Axis Bank on cleared list | Sakshi
Sakshi News home page

రూ.13 వేల కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలకు ఓకే

Apr 30 2016 1:09 AM | Updated on Oct 4 2018 8:24 PM

రూ.13 వేల కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలకు ఓకే - Sakshi

రూ.13 వేల కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలకు ఓకే

యాక్సిస్ బ్యాంక్‌కు విదేశీ వాటా పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

యాక్సిస్ బ్యాంక్‌లో విదేశీ వాటా పెంపునకు ఆమోదం
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్‌కు  విదేశీ వాటా పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సహా మొత్తం 13,030 కోట్ల  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) మొత్తం 14 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను పరిశీలించి ఐదింటికి ఆమోదం తెలిపిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు.  యాక్సిస్ బ్యాంక్‌లో ప్రస్తుతమున్న విదేశీ వాటా పరిమితిని 62 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి అనుమతి లభించిందని,  ఈ ప్రతిపాదన విలువ రూ.12,900 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం విదేశీ వాటా పరిమితి 74 శాతంగా ఉంది. వీటిల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా పరిమితి 49 శాతం. ఓకార్డ్, అరబిందో ఫార్మా కంపెనీల ప్రతిపాదనలు కూడా ఆమోదం పొందాయని ఆ అధికారి వివరించారు.  గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం వృద్ధితో 2,944 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు.  కాగా పెట్టుబడుల జోరు కొనసాగుతోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement