ఇన్ఫోసిస్‌ నెత్తిన మరో పిడుగు

ఇన్ఫోసిస్‌ నెత్తిన మరో పిడుగు - Sakshi


బెంగళూరు: దేశీయ రెండవ అతిపెద్ద  ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ నెత్తిన మరో పిడుగు పడింది.  ఫౌండర్స్‌, ఇన్ఫీ మధ్య రగిలిన ప్యాకేజీ  వివాదం  రగులుతుండగానే మరో వివాదంలో ఇరుక్కుంది.   ఇన్ఫోసిస్ లిమిటెడ్ అమెరికా ఇమ్మిగ్రేషన్ మాజీ హెడ్‌  ఎరిన్ గ్రీన్ తాజాగా  కంపెనీపై దావా వేశారు.  జాతి వివక్ష,  సీనియర్‌ అధికారుల వేధింపులు, మేనేజ్‌మెంట్‌  కక్షపూరిత వైఖరి తదితర ఆరోపణలు గుప్పిస్తూ  పిటీషన్‌ దాఖలు చేశారు. ఇందుకు తనకు భారీ నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ టెక్సాస్‌ కోర్టులో  ఫిర్యాదు చేశారు. 53 పేజీల ఫిర్యాదు పత్రంలో కంపెనీ సీనియర్‌ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు.





2011 లో ఇన్ఫోసిస్‌లో చేరిన ఎరిన్ గ్రీన్, ఉద్యోగి వివక్షత, సీనియర్ మేనేజ్మెంట్ సీనియర్లు తన ప్రతీకార ధోరణిలోవ్యవహరించారంటూ జూన్‌19న  జూన్ 19 న టెక్సాస్ తూర్పు జిల్లాలోని ఒక జిల్లా కోర్టులో ఈ పిటీషన్‌వేశారు. ఇన్ఫోసిస్ ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌పై తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తారు.  గ్లోబల్‌ ఇమ్మిగ్రేషన్ అధిపతి వాసుదేవ నాయక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , టెక్నాలజీ ఆపరేషన్స్‌ గ్లోబల్ హెడ్  వినోద్‌ హేంపాపుర్‌పై విమర్శలు చేశారు. గత ఏడాది సంస్థను విడిచిపెట్టాల్సిందిగా కోరడంపై ఆయన ఈ చర్యకు దిగారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. అయితే  ఈ వ్యవహారంపై స్పందించడానికి  ఇన్ఫోసిస్‌ నిరాకరించింది.


 కాగా ఇటీవల ప్రమోటర్లు కంపెనీలో వాటాలను విక్రయించనున్నారన్న వార్తల నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌కు దాద్లాని రూపంలో మరో షాక్‌ తగిలింది. కంపెనీ అమెరికా హెడ్‌, అంతర్జాతీయ ఉత్పత్తి, రిటైల్‌ విభాగ అధిపతి సందీప్‌ దాదాన్లీ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.







 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top