ఆఫ్రికాపై భారత్ వృద్ధి ప్రభావం! | Enforcement Directorate issues Rs 608 crore notice to TN bank, Standard Chartered | Sakshi
Sakshi News home page

ఆఫ్రికాపై భారత్ వృద్ధి ప్రభావం!

Dec 21 2014 1:08 AM | Updated on Sep 2 2017 6:29 PM

ఆఫ్రికాపై భారత్ వృద్ధి ప్రభావం!

ఆఫ్రికాపై భారత్ వృద్ధి ప్రభావం!

భారత్ స్థిరమైన రీతిలో వృద్ధి బాటన పయనిస్తోందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గ్లోబల్ పరిశోధనా బృందం ఒకటి తన నివేదికలో పేర్కొంది.

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
అక్రా (ఘనా): భారత్ స్థిరమైన రీతిలో వృద్ధి బాటన పయనిస్తోందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గ్లోబల్ పరిశోధనా బృందం ఒకటి తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలో ఇతర దేశాల్లోని పరిస్థితితో పోల్చితే భారత్‌లో కొన్ని ప్రత్యేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. దీనితోపాటు వచ్చే ఏడాది భారత్‌లో చోటుచేసుకున్న వృద్ధి ప్రభావం ఆఫ్రికాపై కూడా పడుతుందని, ఆ దేశంలో భారత్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని  విశ్లేషించింది.

గత ఏడాది ఆఫ్రికాలో ఇండియన్ పెట్టుబడులు 14 రెట్లు పెరిగాయని, వచ్చే ఏడాది ఈ నిధుల పరిమాణం 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ మాజీ ప్రెసిడెంట్ ఆర్‌వీ కనోరియా గతంలో పేర్కొన్న అంశాన్ని  కూడా నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్‌తో పాటు ఆఫ్రికా కూడా వచ్చే ఏడాది ‘వృద్ధి జోన్’లో ఉంటుందని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement