దీపావళి: ముహూరత్‌ స్పెషల్‌ ట్రేడింగ్‌

Diwali Muhurat trading: NSE, BSE to hold special 1-hour session - Sakshi

సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు దీపావళి పర్వదినం లక్ష్మీపూజ సందర్భంగా నేడు (అక్టోబర్‌ 7,బుధవారం) ఉదయం ట్రేడింగ్‌ ఉండదు. అయితే సాధారణ ట్రేడింగ్‌కు బదులుగా ముహూరత్‌ ట్రేడింగ్‌ పేరుతో  ఒక​ గంటపాటు స్పెషల్‌ ట్రేడింగ్‌  నిర్వహించడం ఆనవాయితీ.  ఈ క్రమంలోనే సాయంత్రం 5.30-6.30 మధ్య బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు.  దీనికి ముందు 5.15లకు 15నిమిషాలపాటు ప్రీ  ఓపెనింగ్‌ మార్కెట్‌సెషన్‌ కూడా ఉంటుంది. దీంతో సంవత్‌ 2075 ప్రారంభమవుతుంది. ట్రేడింగ్‌లో భాగంగా బ్లాక్‌డీల్స్‌, ప్రీసెషన్‌, పోస్ట్‌సెషన్‌తో కలిపి సాయంత్రం 5.15 నుంచి 6.50 వరకూ ట్రేడింగ్‌ ఉంటుందని స్టాక్‌ ఎక్స్ఛేంజి ఒక ప్రకటనలో తెలిపింది. 

అలాగే  గురువారం(8న)  మార్కెట్లకు సెలవు ప్రకటించారు.  సో..శుక్రవారం ఉదయం 9.15కు యథావిధిగా  సాధారణ ట్రేడింగ్‌ ప్రారంభంకానుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top