1 లీటర్‌ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి ‘డాట్సన్‌ రెడి–గో’

1 లీటర్‌ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి ‘డాట్సన్‌ రెడి–గో’


న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్‌’ తాజాగా 1 లీటర్‌ ఇంజిన్‌ సామర్థ్యంతో ‘డాట్సన్‌ రెడి–గో’లో కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.3.57 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. రెండు వేరియంట్లలో లభ్యంకానున్న ఈ కొత్త వెర్షన్‌ లీటరుకు 22.5 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన రెడి–గో కొత్త వెర్షన్‌లో ఇంటెలిజెంట్‌ స్పార్క్‌ ఆటోమేటెడ్‌ టెక్నాలజీతో రూపొందిన 1 లీటర్‌ ఇంజిన్‌ను అమర్చామని కంపెనీ పేర్కొంది. నిస్సాన్‌ గతేడాది డాట్సన్‌ బ్రాండ్‌ కింద 800 సీసీతో రెడి–గోను తీసుకొచ్చింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top