వైజాగ్‌లో చైనా సంస్థ ట్రినా సోలార్‌ తయారీ ప్లాంట్‌ | China company Triana Solar Manufacturing Plant in Vizag | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో చైనా సంస్థ ట్రినా సోలార్‌ తయారీ ప్లాంట్‌

Sep 15 2018 2:47 AM | Updated on Oct 22 2018 8:31 PM

China company Triana Solar Manufacturing Plant in Vizag - Sakshi

న్యూఢిల్లీ: చైనాకి చెందిన ట్రినా సోలార్‌ సంస్థ భారత్‌లో సౌర విద్యుత్‌ పరికరాల తయారీ ప్లాంటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇన్వెస్టర్లు, తయారీదారులు, డెవలపర్లతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యిన్‌ రోంగ్‌ ఫాంగ్‌ తెలిపారు. 3,5,10 కి.వా. సామర్ధ్యం గల ట్రినాహోమ్‌ సౌర ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.

2010లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ట్రినాసోలార్‌.. తమ తయారీ ప్లాంటు కోసం 2015లోనే వైజాగ్‌లో స్థలం కొనుగోలు చేసింది. అప్పట్లో వార్షికంగా 500–700 మెగావాట్ల సోలార్‌ పరికరాల సామర్ధ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయాలని భావించింది. అయితే, భారత మార్కెట్‌ పరిమాణం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్లాంటు సామర్థ్యాన్ని కూడా మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని ఫాంగ్‌ పేర్కొన్నారు. దీనికి సుమారు 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement