హెచ్‌-1బీ వీసాలపై మరో కొత్త బిల్లు | Bill introduced in US Senate seeks to increase annual H-1B visas  | Sakshi
Sakshi News home page

హెచ్‌-1బీ వీసాలపై మరో కొత్త బిల్లు

Jan 26 2018 3:13 PM | Updated on Apr 4 2019 5:12 PM

Bill introduced in US Senate seeks to increase annual H-1B visas  - Sakshi

వాషింగ్టన్‌ : హెచ్‌-1బీ వీసాలను ఎలా కఠినతరం చేయాలి? అని ట్రంప్‌ అడ్మినిస్ట్రేటివ్‌ యోచిస్తూ ఉంటే, మరో వైపు వీటి పరిమితిని పెంచాలని రిపబ్లికన్‌ సెనేటర్లు కోరుతున్నారు. ప్రపంచంలో ఉన్న ఉత్తమమైన, ప్రతిభావంతమైన వారిని అమెరికాకు తీసుకువచ్చే లక్ష్యంతో, వార్షికంగా ఇచ్చే హెచ్‌-1బీ వీసాలను పెంచాలంటూ ఇద్దరు రిపబ్లిక్‌ సెనేటర్లు గురువారం ఓ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు.  ఆరిన్ హాచ్, జెఫ్ఫ్ ఫ్లాక్ అనే సెనేటర్లు 'ది ఇమ్మిగ్రేషన్‌ ఇన్నోవేషన్‌( I-‍ స్క్వేర్డ్‌) యాక్ట్‌ 2018 పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. చట్టబద్ధమైన స్టేటస్‌ను కోల్పోకుండానే హెచ్‌-1బీ వీసా హోల్డర్స్‌ తమ ఉద్యోగాన్ని మార్చుకునేలా కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. 

మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌ లాంటి టాప్‌ అమెరికన్‌ ఐటీ కంపెనీలు,  యూఎస్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్‌ లాంటి టాప్‌ ట్రేడ్‌ బాడీలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా పోటీని ఇలానే కొనసాగించడాన్ని ఈ బిల్లు ఎక్కువగా ఫోకస్‌ చేస్తుందని హాచ్, ఫ్లాక్ తెలిపారు. ఎక్కడైతే అమెరికా లేబుర్‌ తక్కువగా ఉంటుందో అక్కడ పరిశ్రమల కోసం హెచ్‌-1బీ వీసా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. హెచ్‌-1బీ ప్రొగ్రామ్‌లో సంస్కరణలు.. మోసపూరితాలను తగ్గించి, వర్కర్లను కాపాడుతుందని, ఎక్కువ ప్రతిభావంతులైన వర్కర్లకు గ్రీన్‌ కార్డు సౌలభ్యాన్ని పెంచుతుందని తెలిపారు.

హెచ్‌-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల నుంచి వసూలు చేసిన ఫీజులను ఎస్‌టీఈఎం వర్కర్ల శిక్షణ, విద్యను ప్రమోట్‌ చేయడానికి ఉపయోగించాలని సెనేటర్లు కోరారు. ప్రతిభావంతమైన ఇమ్మిగ్రేషన్‌, మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ అని... తమకు ఎక్కువ నైపుణ్యమైన ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌ కావాలని హాచ్‌ అన్నారు.  వీసా పీజులను పెంచడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎస్‌టీఈఎం విద్యకు, వర్కర్‌ శిక్షణ కార్యక్రమాలకు 1 బిలియన్‌ డాలర్ల కొత్త ఫండింగ్‌ను అందించామని చెప్పారు. అన్ని వైపుల నుంచి ఈ బిల్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి హెచ్‌-1బీ వీసాల సరఫరాకు అనుమతి ఇవ్వాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుందని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement