మార్కెట్‌లోకి ఆసస్‌ ‘జెన్‌ఫోన్‌ 5జెడ్‌’  | Asus to 'market Zenfone 5z | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ఆసస్‌ ‘జెన్‌ఫోన్‌ 5జెడ్‌’ 

Jul 5 2018 12:56 AM | Updated on Jul 5 2018 12:56 AM

Asus to 'market Zenfone 5z - Sakshi

న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ ‘ఆసస్‌’ తాజాగా ‘జెన్‌ఫోన్‌ 5జెడ్‌’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇది మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. 6 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.29,999గా, 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.32,999గా, 8 జీబీ ర్యామ్‌/ 256 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.36,999గా ఉంది. జెన్‌ఫోన్‌ 5జెడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ జూలై 9 నుంచి కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు మెమరీ, 6.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ స్క్రీన్, 19:9 డిస్‌ప్లే, 12 ఎంపీ+ 8 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఓఎస్‌ (ఆండ్రాయిడ్‌ పి అప్‌డేట్‌ అస్యూరెన్స్‌), ఫేస్‌ ఆన్‌లాక్, 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని వివరించింది. కాగా కంపెనీ నుంచి నాచ్‌ డిస్‌ప్లేతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే.     

Advertisement
 
Advertisement
Advertisement