వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు - కిరణ్‌ మజుందార్‌ షా

Ashamed to have abandoned migrans says Biocon  Kiran Mazumdar Shaw - Sakshi

ప్యాకేజీ  ఒకే : కానీ ఒక పెద్ద అవకాశాన్ని  కోల్పోయాం

డిమాండ్‌ను సృష్టించే అవకాశాలు ఎక్కడ?

వలస కార్మికుల దుస్థితి మనకు సిగ్గు చేటు

జీఎస్‌టీ నుంచి స్వల్ప కాలిక ఉపశమనం కావాలి

సాక్షి, ముంబై : కోవిడ్‌-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన చర్యలు కేవలం ఆర్థిక మనుగుడకు సరిపోతాయని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా  వ్యాఖ్యానించారు.  ఈ సమయంలో డిమాండ్‌ను సృష్టించే పెద్ద అవకాశాన్నికోల్పోయామంటూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు కొనుగోళ్లు పెరగాలంటే జీఎస్‌టీ తగ్గింపులు అవసరమని షా చెప్పారు. కొనుగోలును ప్రోత్సహించడానికి  స్వల్ప కాలిక ఉపశమనం లభించాలనీ, కనీసం మూడు-ఆరునెలలు పాటు జీఎస్‌టీ  భారాన్ని తగ్గించాలన్నారు.  (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!)

సరఫరా కోసం ద్రవ్యత లభ్యతను సృష్టించుకున్నాం..కానీ ఆర్థిక పునరుజ్జీవనంలో చాలా ముఖ్యమైన భాగం డిమాండ్ పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు. డిమాండ్‌ పుంజుకోకపోతే  ఆర్థిక పునరుజ్జీవనం సాధ్యం కాదనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మనం పెద్ద అవకాశాన్ని కోల్పోయామని షా అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఉద్యోగుల వేతనాలన్నింటినీ చెల్లించమని అన్ని పరిశ్రమలను కోరడం అన్యాయమన్నారు. డిమాండ్‌ లేక కుదేలైన సంస‍్థలకు ఇది కష్టమన్నారు. పరిశ్రమలు పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించకపోతే..తాము మరిన్ని సవాళ్లు  ఎదుర్కోవాల్సి వుంటుందన్నారు. (కరోనా : ఉద్యోగులపై వేటు,​ క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్‌)

మరోవైపు కరోనా కట్టడి కోసం విధించిన  లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో వారి మానాన వారిని వదిలివేయడం అవమానకరమని, దీనికి అందరమూ సిగ్గు పడాలన్నారు. అభివృద్ధి చెందాలని భావిస్తున్న దేశ సౌభాగ్యానికి ఇది  మంచిది  కాదన్నారు. పేదలకు సామాజిక భద్రత ప్రాముఖ్యాన్ని గురించి  నొక్కిచెప్పిన షా, కనీస ప్రాతిపదిక ఆదాయాన్ని ప్రకటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు)

ఉద్దీపన ప్యాకేజీ సానుకూలతల గురించి మాట్లాడుతూ సంస్కరణల పరంగా వ్యవసాయం మంచి ప్రోత్సాహం లభించిందని కిరణ్‌ మజుందార్‌ షా  భావించారు. అయినప్పటికీ, ఆధునికీకరణ పరంగా వారికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలు లభించాలన్నారు.  అలాగే  గ్రామీణాభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు లభించాయని షా తెలిపారు. దీంతోపాటు కరోనా వైరస్‌ కేసుల సంఖ్య కంటే మరణాల రేటుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తాను ఎప్పుడూ చెబుతున్నట్టుగానే, పెరుగుతున్న కేసుల గురించి భయపడకుండా మెరుగైన చికిత్సలు, ఔషధాలు, రోగుల నిర్వహణతో వైరస్‌ను మ్యానేజ్‌ చేయాలని ఆమె  సూచించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-11-2020
Nov 26, 2020, 19:24 IST
‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప...
26-11-2020
Nov 26, 2020, 16:35 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్‌మాస్క్‌ ధరించడం అనివార్యంగా మారిపోయింది.
26-11-2020
Nov 26, 2020, 13:30 IST
న్యూయార్క్‌: కరోనా వైరస్‌ కట్టికి బ్రిటిష్‌, స్వీడిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్‌ఫర్డ్‌...
26-11-2020
Nov 26, 2020, 13:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ అమ్మకాలకు కరోనా వైరస్‌ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌లో...
26-11-2020
Nov 26, 2020, 12:07 IST
సింగపూర్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్‌ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు...
26-11-2020
Nov 26, 2020, 10:02 IST
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో...
26-11-2020
Nov 26, 2020, 09:54 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి....
26-11-2020
Nov 26, 2020, 08:25 IST
భోపాల్‌: కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో మహమ్మారి బారిన పడిన ఓ యువ వైద్యుడు కన్నుమూశాడు. నెలరోజుల పాటు...
26-11-2020
Nov 26, 2020, 04:28 IST
గుంటూరు మెడికల్‌:  కోవిడ్‌–నివారణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ బుధవారం గుంటూరు...
26-11-2020
Nov 26, 2020, 02:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకాను మొదటి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది....
25-11-2020
Nov 25, 2020, 19:01 IST
మలేసియాకు చెందిన ‘టాప్‌ గ్లోవ్‌’ కంపెనీలో ఊహించని సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
25-11-2020
Nov 25, 2020, 18:32 IST
దేశంలో కరోనా కేసులు కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
25-11-2020
Nov 25, 2020, 15:26 IST
కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ, మరణాలు తక్కువగా ఉండడానికి కూడా కారణాలు తెలియడం లేదు.
25-11-2020
Nov 25, 2020, 15:14 IST
డిసెంబర్‌ 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
25-11-2020
Nov 25, 2020, 14:26 IST
కోవిడ్‌-19 కట్టడికి యూఎస్‌ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ పేద, మధ్యాదాయ దేశాలకు అందే వీలున్నట్లు తెలుస్తోంది. ...
25-11-2020
Nov 25, 2020, 10:05 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,376 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు...
25-11-2020
Nov 25, 2020, 06:54 IST
మాస్కో: రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ 5 కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఉత్పత్తిదారులు తెలిపారు. రెండు...
25-11-2020
Nov 25, 2020, 06:09 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన...
25-11-2020
Nov 25, 2020, 04:19 IST
న్యూఢిల్లీ : కరోనా విషయంలో ప్రజల్లో అప్రమత్తత స్థానంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు....
25-11-2020
Nov 25, 2020, 03:23 IST
సాక్షి, హైదరాబాద్ ‌: శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top