కరోనా : ఉద్యోగులపై వేటు,​ క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్‌

Swiggy sacks 1100 employees as COVID19 derails Cloud kitchens - Sakshi

స్విగ్గీలో 1100 మంది ఉద్యోగుల తొలగింపు

ఊహించని  తొలగింపులు విచారకరం  - స్విగ్గీ

క్లౌడ్‌ కిచెన్స్‌ బిజినెస్‌  మూత

సాక్షి, ముంబై: కోవిడ్‌-19 సంక్షోభం  అన్ని వ్యాపార సంస్థలను ఘోరంగా దెబ్బతీసింది. ఫలితంగా కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.  దేశవ్యాప్త సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ పతనమై, కుదేలైన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ  కంపెనీ స్విగ్గీ  ఉద్యోగులకు షాకింగ్‌  న్యూస్‌​ చెప్పింది.  ఖర్చులను తగ్గించడానికి, రాబోయే కొద్ది రోజుల్లో 1100మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు స్విగ్గీ సోమవారం (మే 18) ప్రకటించింది. అనూహ్య రీతిలో ఉద్యోగులను తొలగించాల్సి రావడం తమకు (స్విగ్గీకి) విచారకరమైన రోజుల్లో ఒకటి అని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు,సీఈవో శ్రీహర్ష మాజేటి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన  తమ ఉద్యోగులకు ఈ మెయిల్   సమాచారాన్ని అందించారు. ప్రభావిత ఉద్యోగులందరికీ వారి నోటీసు వ్యవధి లేదా పదవీకాలంతో సంబంధం లేకుండా కనీసం మూడు నెలల జీతం అందుతుందని వర్చువల్ టౌన్ హాల్ సమావేశంలో ఉద్యోగులకు చెప్పారు.  ప్రతి సంవత్సరానికి ఒక  నెల అదనంగా జీతం ఇస్తామని, పదవీకాలాన్ని బట్టి 3-8 నెలల జీతాన్ని అందిస్తామని  చెప్పారు. సంబంధిత ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులతోపాటు, అదనంగా  వారి తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా సదుపాయం డిసెంబర్ 31, 2020 వరకు అందుబాటులో వుంటుందనీ వెల్లడించారు.

కరోనాకు సంబంధించి అతిపెద్ద ప్రభావం క్లౌడ్ కిచెన్స్ వ్యాపారంపై  పడిందని  స్విగ్గీ సీఈవో  చెప్పారు. ఇది ఇంకా చాలా అస్థిరంగా  ఉండనున్న నేపథ్యంలో రాబోయే 18 నెలల పాటు మూసివేయనున్నట్లు తెలిపారు. ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగుతుందో ఎవ్వరికీ తెలియదని, దీని ప్రభావం స్విగ్గీపై అయితే తక్కువ కాలం ఉంటుందని ఆశిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నారు.  కరోనా  కల్లోలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే తమ  కిచెన్‌ ఫెసిలీటీస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేసే ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే  రోజుల్లో ఉండే వ్యాపారం,  లాభదాయకతను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

రూ. 250 కోట్ల పెట్టుబడితో 2020 మార్చి నాటికి  దేశవ్యాప్తంగా  12 కొత్త నగరాల్లో క్లౌడ్‌ కిచెన్స్‌ ఏర్పాటు చేయనున్నామని గత ఏడాది డిసెంబరు లో ప్రకటించింది. చైనా తర్వాత క్లౌడ్ కిచెన్ల సౌకర్యాన్ని అందిస్తున్న రెండో అతిపెద్ద దేశంగా ఇండియా అవతరిస్తుందని, 8 వేల కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ప్రస్తుతం  పరిస్థితులు తారుమారుకావడంతో తాజా నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే తమ ఉద్యోగులలో13 శాతం మందిని తొలగించినట్లు ఇటీవల ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్రకటించిన సంగతి తెలిసిందే.   కొన్ని ఆంక్షల సడలింపులతో లాక్ డౌన్ 4.0 ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. (కుప్పకూలిన మార్కెట్లు : 9 వేల దిగువకు నిఫ్టీ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-01-2021
Jan 21, 2021, 16:54 IST
వాషింగ్టన్‌:  పలు చోట్ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ఆస్పత్రిపాలు అవుతుండటంతో జనాలు వ్యాక్సిన్‌ అంటేనే జంకుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవాలా? వద్దా? అని పునరాలోచనలో...
21-01-2021
Jan 21, 2021, 14:18 IST
సాక్షి, కరీంనగర్‌ : జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ వికటించి ఒకరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు జ్వరంతో ఇబ్బంది పడుతున్న అంగన్...
21-01-2021
Jan 21, 2021, 12:36 IST
విషయం ఏంటంటే పాజిటివ్‌ వచ్చిన వారిలో 69 మందికి వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ కూడా ఇచ్చారు
21-01-2021
Jan 21, 2021, 11:43 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాలు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీకా మొదట...
21-01-2021
Jan 21, 2021, 04:12 IST
పొదలకూరు: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరేసుకుని...
21-01-2021
Jan 21, 2021, 03:50 IST
సాక్షి, అమరావతి: నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 25,126 మందికి వ్యాక్సిన్‌...
20-01-2021
Jan 20, 2021, 11:50 IST
సెకండ్‌ డోస్‌ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు డాటా వెల్లడించింది
20-01-2021
Jan 20, 2021, 11:36 IST
టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కోవిడ్‌ అనుభవాలను  సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా...
20-01-2021
Jan 20, 2021, 09:23 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా...
20-01-2021
Jan 20, 2021, 08:43 IST
న్యూఢిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకోవడంపై సమాజంలో అపోహలు ఉన్నాయని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. మంగళవారం ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో...
19-01-2021
Jan 19, 2021, 12:57 IST
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా  మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు  సీరం వ్యాక్సిన్‌ తీసుకున్న 24...
19-01-2021
Jan 19, 2021, 10:34 IST
సాక్షి, పిఠాపురం: స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మండలంలోని విరవ ఆస్పత్రికి తరలించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వయల్స్‌ పగిలిపోయిన సంఘటన వైద్య,...
19-01-2021
Jan 19, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణీత...
19-01-2021
Jan 19, 2021, 08:06 IST
బెంగళూరు : వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్‌లోనూ, మరొకరు కర్ణాటకలోనూ...
19-01-2021
Jan 19, 2021, 03:16 IST
సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్‌ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606...
18-01-2021
Jan 18, 2021, 20:35 IST
సాక్షి,  హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్‌ తీసుకున్న ఏడుగురు ఒళ్లు నొప్పులు,...
18-01-2021
Jan 18, 2021, 15:28 IST
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం మొదటి ఫేజ్‌...
18-01-2021
Jan 18, 2021, 10:54 IST
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నివారణకుగాను ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు...
18-01-2021
Jan 18, 2021, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జనాభాలో ఏకంగా 20 శాతానికి పైగా...
18-01-2021
Jan 18, 2021, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రక్రియ రెండో రోజూ చురుగ్గా కొనసాగింది. ఉదయం 9 గంటలకే వ్యాక్సిన్‌ ప్రక్రియ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top