యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది.. | Sakshi
Sakshi News home page

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..

Published Thu, Apr 16 2020 10:56 AM

 Apple iPhone SE launched in India for Rs 42500 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పటినుంచో ఊరిస్తున్న యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (2020)ని కంపెనీ  విడుదల చేసింది. 'జనాదరణ పొందిన డిజైన్‌లో శక్తివంతమైన కొత్త స్మార్ట్‌ఫోన్' గా యాపిల్  ప్రకటించింది. హాప్టిక్ టచ్ సపోర్ట్ అనే కొత్త ఫీచర్ తో లాంచ్ చేసిన ఐఫోన్ ఎస్ఈ(2020) ధర మన దేశంలో  రూ.42,500 (64 జీబీ వేరియంట్‌) నుంచి ప్రారంభం కానుంది. ఇది మాత్రమే కాకుండా 128 జీబీ, 256 జీబీ వేరియంట్లు కూడా అందుబాటులో  ఉండనున్నాయి.  డిజైన్ పరంగా  ఐఫోన్ 8ను పోలిన లేటెస్ట్  ఐఫోన్ లో ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ బటన్  అందించింది. ఎరుపు, నలుపు,  తెలుపు మూడు  రంగుల్లో లభ్యం కానున్నాయి. అయితే వీటి ధరలను అధికారికంగా ఆపిల్ ప్రకటించలేదు. అలాగే మనదేశంలో ఎప్పటినుంచి  వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేదీ స్పష్టత ఇవ్వలేదు.  

కానీ అమెరికాలో మాత్రం తక్కువ ధరకే ఈ ఫోన్ ను లాంచ్ చేసింది కంపెనీ. అమెరికాలో  64 జీబీ మోడల్ ఐఫోన్ ఎస్ఈ ధర 399 డాలర్ల(సుమారు రూ.30,500) నుంచి ప్రారంభం కానుంది. 128 జీబీ మోడల్ ధరను 499 డాలర్లు (సుమారు రూ.34,400) గానూ, 256 వేరియంట్ ధరను 549 డాలర్లు(సుమారు రూ.45,000) గానూ నిర్ణయించింది.  ఇండియాలో అయితే 128 జీబీ  స్టోరేజ్ వేరియంట్   ధర  రూ. 47,800 గాను,  256 జీబీ స్టోరేజ్ వేరియంట్   ధర రూ. 58,300 గా వుంటుందని అంచనా.

ఐఫోన్ ఎస్ఈ(2020) ఫీచర్లు
4.7 అంగుళాల రెటీనా హెచ్ డీ ఎల్సీడీ డిస్ ప్లే
750x1334 పిక్సెల్స్  రిజల్యూషన్ 
12 మెగాపిక్సెల్  రియర్ కెమెరా
7 ఎంపీ సెల్ఫీ కెమెరా

Advertisement
Advertisement