అపోలో హాస్పిటల్స్‌ లాభం 80 శాతం అప్‌ | Apollo Hospitals Q3 net profit up 80 per cent to Rs 90 crore | Sakshi
Sakshi News home page

అపోలో హాస్పిటల్స్‌ లాభం 80 శాతం అప్‌

Feb 14 2020 5:45 AM | Updated on Feb 14 2020 5:45 AM

Apollo Hospitals Q3 net profit up 80 per cent to Rs 90 crore - Sakshi

న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్‌ క్వార్టర్లో 80% ఎగసింది. గతేడాది (2018–19) క్యూ3లో రూ.50 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ3లో రూ.90 కోట్లకు పెరిగిందని అపోలో హాస్పిటల్స్‌తెలిపింది. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపనీ చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.2,495 కోట్ల నుంచి రూ.2,912 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement