టీవీఎస్ సప్లై చైన్‌ ఫలితాలు అదుర్స్! | TVS Supply Chain Turns Profitable in Q4 After Last Year Losses | Sakshi
Sakshi News home page

టీవీఎస్ సప్లై చైన్‌ ఫలితాలు అదుర్స్!

May 31 2026 6:47 PM | Updated on May 31 2026 6:48 PM

TVS Supply Chain Turns Profitable in Q4 After Last Year Losses

ప్రయివేట్‌ రంగ సంస్థ టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలనువీడి రూ. 18 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4 కోట్ల నికర నష్టం ప్రకటించింది.

మొత్తం ఆదాయం సైతం 21 శాతం ఎగసి రూ. 3,032 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,499 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 10 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,996 కోట్ల నుంచి రూ. 11,003 కోట్లకు బలపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement