త్వరలో వాయు వేగంతో ప్రయాణించే కారు

Apex Motors To Introduce Electric Super Car With In A week - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. కార్బన్‌ ఉద్గారాలను విడుదల చేసే పెట్రోల్‌, డిజిల్‌ కార్ల కన్నా, కాలుష్యానికి హాని కలిగించని ఎలక్ట్రిక్‌ కార్ల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మోటారు రేసింగ్‌ ఔత్సాహికుల కోసం కంపెనీలు సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. వాటిలో భాగంగానే గంటకు 305 కిలోమీటర్ల వాయు వేగంతో ప్రయాణించే ఏపీ-1 అనే ఎలక్ట్రిక్‌ సూపర్‌ కారును అపెక్స్‌ మోటార్స్‌ వారం రోజుల్లో ఆవిష్కరించనుంది. హాంకాంగ్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఈ సూపర్‌ కారును రూపకల్పన చేశారని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఏపీ 1 సూపర్‌ కారు 620కిలోగ్రాముల బరువు, కార్బన్‌ ఫైబర్‌తో కూడిన అత్యుధునిక డిజైన్‌లతో రూపిందించినట్లు తెలుస్తోంది.  కొండ ప్రాంతాలలో కూడా ఏపీ-1 కారు వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఆవిష్కర్తలు చెబుతున్నారు. ఏపీ 1 ఎలక్ట్రిక్‌ కారు పూర్తి చార్జింగ్‌తో 515 కిలోమీటర్లు ప్రయాణించగలదని, ఫాస్ట్‌ చార్జర్‌తో 20 నిముషాల్లో 80శాతం చార్జింగ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగానే ఎలక్ట్రిక్‌ కారు రూపకల్పన చేశామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

చదవండి: ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top