వేదాంత డైరెక్టర్‌గా అనిల్‌ అగర్వాల్‌

Anil Agarwal is the Director of Vedanta Company - Sakshi

న్యూఢిల్లీ: మైనింగ్‌ మ్యాగ్నెట్‌ అనిల్‌ అగర్వాల్‌.. వేదాంత కంపెనీలో తొలిసారిగా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రిసోర్సెస్‌కు అధినేతగా అనిల్‌ అగర్వాల్‌ వ్యవహరిస్తున్నారు. అనిల్‌ అగర్వాల్‌(66)ను నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించామని వేదాంత లిమిటెడ్‌ తెలిపింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను అనిల్‌ అగర్వాల్‌ సోదరుడు నవీన్‌ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌గా నవీన్‌ వ్యవహరిస్తారని పేర్కొంది. కంపెనీ సీఈఓ ఎస్‌. వెంకటకృష్ణన్‌ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది. మరోపక్క, హిందుస్తాన్‌ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్‌ దుగ్గల్‌ను  వేదాంత సీఈఓగా నియమించామని తెలిపింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top