ఆంధ్రా బ్యాంకు 2000వ బ్రాంచ్ | andhra bank 2000 branch in vijayawada | Sakshi
Sakshi News home page

ఆంధ్రా బ్యాంకు 2000వ బ్రాంచ్

Mar 11 2014 1:28 AM | Updated on Sep 2 2017 4:33 AM

ఆంధ్రా బ్యాంకు 2000వ బ్రాంచ్

ఆంధ్రా బ్యాంకు 2000వ బ్రాంచ్

ఆంధ్రా బ్యాంకు 2000వ శాఖను విజయవాడలోని అయోధ్యనగర్ లోటస్‌ల్యాండ్ మార్క్‌లో సోమవారం ఆ బ్యాంకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సీవీఆర్ రాజేంద్రన్ ప్రారంభించారు.

 విజయవాడ (మధురానగర్), న్యూస్‌లైన్  : ఆంధ్రా బ్యాంకు 2000వ శాఖను విజయవాడలోని అయోధ్యనగర్ లోటస్‌ల్యాండ్ మార్క్‌లో సోమవారం ఆ బ్యాంకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సీవీఆర్ రాజేంద్రన్ ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకు మొట్టమొదట జిల్లాలోని మచిలీపట్నంలోనే ప్రారంభమయ్యిందని, రెండు వేలవ బ్రాంచిని కూడా జిల్లాలోనే ఏర్పాటుచేయడం విశేష మన్నారు.
 
 దేశవ్యాప్తంగా  రెండు వేల బ్రాంచీలలో 1213 బ్రాంచీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఇందులో సీమాంధ్రప్రాంతంలో 754 శాఖలు, తెలంగాణా ప్రాంతంలో 459 బ్రాంచీలున్నాయన్నారు. సీమాంద్ర, తెలంగాణా ప్రాంతాలు విడిపోయినా బ్యాంకు సేవలలలో మాత్రం ఎటువంటిలోపాలు రానీయమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement