అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ : బిగ్‌ సేల్స్‌తో ఒకేసారి పోటీ

Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days Start Same Day - Sakshi

రెండు ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌.. ఈ పండుగ సీజన్‌లో ఒకేసారి బిగ్‌ సేల్స్‌తో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ తన అతిపెద్ద బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌కు తెరలేపుతుండగా.. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను ధూంధాంగా నిర్వహించబోతుంది. ఈ రెండు సేల్స్‌ కూడా ఒకేసారి అంటే అక్టోబర్‌ 10 నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ తన బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ అక్టోబర్‌ 10 నుంచి నిర్వహించబోతున్నట్టు ప్రకటించగానే.. అమెజాన్‌ సైతం తన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను కూడా అక్టోబర్‌ 10 నుంచే ప్రారంభించబోతున్నట్టు పేర్కొంది. అక్టోబర్‌ 10న ప్రారంభమయ్యే అమెజాన్‌ సేల్‌, అక్టోబర్‌ 15 అర్థరాత్రితో ముగుస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ అక్టోబర్‌ 14తో క్లోజవుతుంది. 

ముందస్తు మాదిరిగానే అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్లు, అతిపెద్ద ఉపకరణాలు, టీవీలు, హోమ్‌, కిచెన్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌, గ్రోసరీ, బ్యూటీ, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఆఫ​ర్లను అందించనున్నట్టు ప్రకటించింది. ప్రైమ్‌ మెంబర్లకు ఈ సేల్‌ కాస్త ముందుగానే అందుబాటులోకి వస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ కూడా 300 రూపాయలను క్యాష్‌బ్యాక్‌ రూపంలో అందించనుంది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో పాటు పలు బ్యాంక్‌లకు నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్స్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, పలు స్మార్ట్‌పోన్లపై పూర్తి డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ను అమెజాన్‌ ఆఫర్‌ చేస్తుంది.  

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించనున్న సేల్‌లో మొబైల్స్‌, గాడ్జెట్లు, టీవీలు, అతిపెద్ద ఉపకరణాలు వంటి అన్ని ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందించనున్నట్టు చెప్పింది. ఈ ఏడాది తన కస్టమర్లకు బహుళ పేమెంట్‌ ఆప్షన్లపై ఆఫర్లను అందించడానికి మాస్టర్‌కార్డుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కూడా వెల్లడించింది ఫ్లిప్‌కార్ట్‌. దీని సేల్‌ ఐదు రోజులు కొనసాగనుంది. తొలి రోజు సేల్‌లో ఫ్యాషన్‌, టీవీ, అప్లియెన్స్‌, ఫర్నీచర్‌, స్మార్ట్‌ డివైజ్‌లపై ఆఫర్లను అందించనుంది. రెండో రోజు సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై బంపర్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తుంది. చివరి మూడు రోజులు అన్ని కేటగిరీల వస్తువులపై ఆఫర్లను ప్రకటించనుంది. సాధారణంగా సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లతో పాటు, ప్రతి గంట గంటకు ఫ్లాష్‌ సేల్స్‌, ఎనిమిది గంటలకు ఒక్కసారి కొత్త కొత్త డీల్స్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ఎక్కువ మొత్తంలో పేమెంట్‌ ఆప్షన్లను అందిస్తుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు యూజర్లకు పేమెంట్‌ ఆఫర్లు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఈఎంఐ కార్డులతో పాటు ఎంపిక చేసిన కార్డులకు నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌, రూ.60వేల వరకు కార్డులెస్‌ పేమెంట్‌ వంటివి ఆఫర్‌ చేస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లలాగా.. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా ముందస్తు యాక్సస్‌, సేల్‌ ప్రారంభం కావడానికి కంటే మూడు గంటల ముందే డీల్స్‌ యాక్సస్‌ లభిస్తాయి. ఫోన్‌పే యూజర్లు కూడా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ల యాక్సస్‌ పొందుతారు. ట్రావెల్‌, మొబైల్‌ రీఛార్జ్‌లపై డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తుంది. ఈ సేల్‌ కోసం సెలబ్రిటీలు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణే, విరాట్‌ కోహ్లితో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ మరింత ప్రమోట్‌ చేయనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top