ఎయిర్‌టెల్ సెట్-టాప్ బాక్స్‌ల ధర తగ్గింపు

Airtel slashes prices of Digital TV HD and SD Set-Top Boxes - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ టెలికాం సంస్థ  ఎయిర్‌టెల్‌  కొత్త చందాదారులకోసం ప్రణాళికలు  వేస్తోంది. ఇందుకోసం తాజాగా హెచ్‌డి, ఎస్‌డి సెట్-టాప్ బాక్స్‌ల ధరలను  తగ్గించింది.  డీటీహెచ్ ఆపరేటర్లలో రోజు రోజుకు పోటీ పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా కొత్త వినియోగదారులను ఆకర్షించనుంది.  గత త్రైమాసికంలో నాలుగు లక్షలమంది  ఖాతాదారులను తన ఖాతాలో చేర్చుకున్న భారతి ఎయిర్‌టెల్ ఇపుడు సెట్-టాప్ బాక్సల  ధరలను రూ. 500 వరకు తగ్గించింది.  

ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు ఇప్పుడు రూ .1300 వద్ద హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ను పొందవచ్చు, ఇప్పటివరకు దీని ధర రూ .1800గా ఉంది. ఈ  తగ్గింపుతో  హెచ్‌డి బాక్స్‌ రూ.1,300 ధరతో అందిస్తుండగా, ఎస్‌డీ సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కేవలం రూ.1100ల ధర వద్ద అందిస్తోంది.  కాగా డీటీహెచ్ ఆపరేటర్లలో మిగిలిన వారి ధరలతో పోల్చితే టాటా స్కై హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ధర రూ .1499, ఎస్‌డి సెట్-టాప్ బాక్స్‌ ధర రూ .1399గా ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top